Devi Sri Prasad: ‘ఊ అంటావా’ పాటకు సమంతనే బెస్ట్ ఛాయిస్.. దేవి రీవిల్స్!

పుష్ప ది రైజ్.. ఈ మధ్య ఎవరి నోటా నుంచి విన్నా కూడా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది.

  • Written By:
  • Publish Date - January 17, 2022 / 05:42 PM IST

పుష్ప ది రైజ్.. ఈ మధ్య ఎవరి నోటా నుంచి విన్నా కూడా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. కేవలం నటనపరంగానే కాకుండా, ఈ సినిమాలో పాటలు కూడా ఆద్యంతం అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రెడిట్ అంతా టాలీవుడ్ యువ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ ప్రసాద్ కు దక్కుతుంది. ఇప్పటికే దేవి ఖాతాల్లో ఎన్నో హిట్స్ సాంగ్స్ ఉన్నాయి. రింగా రింగా లాంటి ఐటమ్స్ సాంగ్స్ కూడా ఉన్నాయి. తాజాగా ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఊ అంటవా మావా… ఊఊ అంటావా మావా.. అనే పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

ఈ సినిమా ఐదు భాషల్లో విడుదలైంది. నిర్మాతలు హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో అన్ని పాటలను కూడా విడుదల చేశారు. ఇక నటి సమంత నటించిన ఊ అంటవా అనే పాట స్పెషల్ అట్రాక్ట్ గా నిలిచింది. ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ నటిని ఫైనల్ చేయకముందే ఐటమ్ సాంగ్ రెడీ చేశాం.. సమంతను ఎంపిక చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నప్పుడు.. ఆమెని ఫైనల్ చేయడానికి రెండు రోజుల ముందే నాకు సమాచారం అందింది.. అయితే ఆమె బెస్ట్ ఛాయిస్ అని తీసుకొచ్చారు. సమంత ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రల్లో నటించింది. అలాంటి నటి మొదటి ఐటెం సాంగ్స్ లో నటించింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాగా డాన్స్ చేసింది.

ఊ అంటావా మాత్రమే కాదు, వివిధ భాషల్లోని పుష్ప: ది రైజ్‌లోని అన్ని పాటలు కూడా ఫేమ్ అయ్యాయి. ఈ విషయమై దేవి మాట్లాడుతూ “భాష తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే వివిధ భాషలలో పాటలను రూపొందించడంలో ఇది సహాయపడుతుంది. అన్ని భాషలలో ఒకే సమయంలో అన్ని పాటలను రూపొందించడం చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. ఎందుకంటే కంపోజ్ మరియు రికార్డింగ్ కాకుండా. ఆర్కెస్ట్రేషన్, ప్రతి పాటకు ఐదు వేర్వేరు భాషల్లో గాత్రాన్ని రికార్డ్ చేయడానికి దాదాపు ఒకటి నుండి ఒకటిన్నర నెలల సమయం పట్టింది. ఆశ్చర్యకరంగా ప్రజలు అన్ని భాషల్లోని పుష్ప పాటలను వింటున్నారు. అది మాకు పెద్ద విజయం.”