Site icon HashtagU Telugu

Salman Khan : సల్మాన్ ఇంటి బయట కాల్పులకు ప్లానింగ్.. ఎక్కడ జరిగింది ? ఎవరు చేశారు ?

Salman Khan Rib Injury

Salman Khan Rib Injury

Salman Khan : నిన్న (ఏప్రిల్ 14) ఉదయం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద తుపాకులతో ఇద్దరి వ్యక్తులు కాల్పులు జరిపి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సల్మాన్ ఇంటి పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన అంతా అక్కడ సిసి టీవీలో రికార్డు అయ్యింది. అయితే ఈ కాల్పులు జరిపింది ఎవరు..? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు..?

ఈ కాల్పులు వెనుక ఉన్నది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ అని అందరూ భావించారు. అయితే లారెన్స్ బిష్ణోయ్‌ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. దీంతో ఈ కాల్పులు వెనుక అతనే ఉన్నాడా అనేది కొంత సందేహంగా నిలిచింది. అయితే తాజా పోలిసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే.. అందరూ అనుకున్నట్లు దీని వెనుక ఉన్నది లారెన్స్ బిష్ణోయ్‌ అంట. తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ తో లారెన్స్ బిష్ణోయ్ ఇదంతా జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇక ఈ కాల్పులకు ప్లానింగ్ USలో జరిగిందట. అమెరికాలో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారాతో ఈ ప్లాన్ ని ముందుకు తీసుకు వెళ్లారట. రోహిత్ గోదారాకి చెందిన షూటర్లే సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలుపుతున్నారు. కాగా ఈ ఘటనకు బాధ్యులం మేమే అంటూ అన్మోల్ బిష్ణోయ్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ ఫేస్‌బుక్ అకౌంట్ యొక్క IP అడ్రస్ కెనడాకు చెందినదిగా చూపిస్తుంది.

దీని గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ ఫేస్‌బుక్ అకౌంట్ లో వీపీఎన్‌ని ఉపయోగించి పోస్ట్ వేసినట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నింధితులను పట్టుకునేందుకు.. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ వంటి ఐదు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ప్రయత్నాలు ప్రారంభించారు.

సల్మాన్ ఖాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ మధ్య ఘర్షణకు కారణం ఏంటంటే.. 1998 సల్మాన్ కృష్ణ జింకలను వేటాడి చంపిన విషయం తెలిసిందే. లారెన్స్ బిష్ణోయ్‌ సమాజం కృష్ణ జింకలను తమ గౌరవంగా భావిస్తారు. అలాంటిది సల్మాన్ వాటిని చంపడంతో.. సల్మాన్ తమ సమాజాన్ని కించపరిచడాన్ని, అందుకే అతని శిక్ష విధిస్తామంటూ బహిరంగంగా చంపేస్తా అంటూ బెదిరింపులు చేసాడు.

Also read : NTR : వార్ 2లోని ఎన్టీఆర్ లుక్‌ని లీక్ చేసిన చేసిన ఊర్వశి రౌటెలా.. సెల్ఫీ పిక్ వైరల్..

Exit mobile version