Site icon HashtagU Telugu

Allu Arjun Juices: క్రేజ్ తగ్గని పుష్ప.. ముంబైలో ఓ అభిమాని ఏం చేశాడంటే..?

Whatsapp Image 2022 10 29 At 5.44.14 Pm

Whatsapp Image 2022 10 29 At 5.44.14 Pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. సినిమా విడుదలైనప్పటి నుంచి భాషతో సంబంధం లేకుండా బన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ చెప్పకుండా ఉండని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. తగ్గేదేలే అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. అయితే.. తాజాగా బన్నీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు ఓ అభిమాని. పుష్ప పేరు మీద జ్యూస్‌ల విక్రయం ప్రారంభించాడు. ముంబైకి చెందిన బంటీ అనే వ్యాపారి అల్లు అర్జున్ డైలాగ్‌లు, ఫొటోలతో కూడిన గ్లాసుల్లో జ్యూస్ విక్రయిస్తున్నాడు. బన్నీ పేరు మీద అనే రకాల జ్యూస్ లు కస్టమర్లకు అందిస్తున్నారు.

ఆ వ్యాపారి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ మొదటి సినిమా నుంచి అభిమానిని. ఆయన డైలాగ్స్ అన్నీ ఇష్టపడతాను. పుష్ప సినిమాలో నాకు ఇష్టమైన డైలాగ్ తగ్గేదేలే. హిందీలో ఫైర్ హై మెయిన్, జుఖేగా నహీ అంటూ ఆ డైలాగ్‌ను చెప్పాడు ఆ అభిమాని. టాలీవుడ్‌లో 2021 డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, అజయ్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషించాగా.. రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ ఆధారంగా దర్శకుడు సుకుమార్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవలే పుష్ప-2 మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Exit mobile version