Site icon HashtagU Telugu

AB DILLI DUR NAHIN : ముకేశ్ అంబానీ ఇంట్లో “అబ్ దిల్లీ దూర్ నహీ”

Ab Dilli Dur Nahin

Ab Dilli Dur Nahin

మన ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఇల్లు..  యాంటిలియా

అదేనండీ.. అపర కుబేరుడు  ముకేశ్ అంబానీ 27 అంతస్తుల ఇల్లు.. 

ముంబైలోని కఫ్ పరేడ్ ప్రాంతంలో ఉన్న ఆ భారీ భవనం మరో ప్రత్యేక ఘట్టానికి వేదికగా నిలిచే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.. 

మరేం లేదు .. ముకేశ్ అంబానీకి ఒక కోరిక కలిగిందట.. ఆయన తన ఇల్లు యాంటిలియాలోని ప్రయివేట్ థియేటర్ లో  “అబ్ దిల్లీ దూర్ నహీ”(AB DILLI DUR NAHIN) మూవీని స్క్రీనింగ్ చేయించుకోవాలని భావిస్తున్నారట. దీనిపై ముకేశ్ అంబానీ టీమ్ నుంచి  ఇమ్రాన్ జాహిద్ బృందానికి  ఈమెయిల్ లో రిక్వెస్ట్ వెళ్లిందట. మే 12న (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్  అయింది. బిహార్‌కు చెందిన ఔత్సాహిక సివిల్ సర్వెంట్ స్టోరీ తో ఈ సినిమా తీశారు. ఈ మూవీ(AB DILLI DUR NAHIN) స్టోరీ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీకి బాగా నచ్చిందట. దీంతోవారు ఈ మూవీని తమ  యాంటిలియాలోని  ప్రైవేట్ థియేటర్‌లో స్క్రీనింగ్  చేయాలని ఇమ్రాన్ జాహిద్ బృందానికి రిక్వెస్ట్ పంపారు. మెయిల్ లో..  “యాంటిలియాలో ఉన్న  థియేటర్‌లో మా CMD గారి ప్రైవేట్ వీక్షణ కోసం మీ సినిమా అబ్ దిల్లీ దుర్ నహిన్ స్క్రీనింగ్‌ చేసే అంశాన్ని పరిశీలించగలరు” అని ఉంది. అంబానీ ఫ్యామిలీ వాళ్లకు నచ్చిన సినిమాలను వారి ఇంట్లోని  థియేటర్‌లో చూడటానికి ఇష్టపడతారు.  యాంటిలియాలో మూడు హెలిప్యాడ్‌లు, 80 మంది అతిథులు కూర్చునే థియేటర్, స్పా, 168 వాహనాల కోసం గ్యారేజ్, బాల్‌రూమ్, టెర్రేస్డ్ గార్డెన్ ఉన్నాయి.అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక పౌరాణిక ద్వీపానికి “యాంటిలియా” అని పేరు పెట్టారు.

Exit mobile version