Site icon HashtagU Telugu

Ambani Gift: మెగా కంపౌండ్ లో అంబానీ కోటి విలువైన బంగారు ఉయ్యాల?

Ambani Gift

New Web Story Copy 2023 07 01t132753.614

Ambani Gift: ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగా ప్రిన్సెస్ గురించే చర్చ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పెళ్ళైన పదేళ్ల తరువాత ఈ దంపతులు మహాలక్షిని కనడంతో మెగా కాంపౌండ్ లో పండుగ వాతావరణం నెలకొంది. నిన్న శుక్రవారం మెగా ప్రిన్సెస్ కి నామకరణ వేడుక జరిగింది. ఈ సందర్భంగా మెగా వారసురాలికి క్లిన్ కారా కొణిదెలగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు మరియు వీడియోలు ఇంటర్నెట్‌లో ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం ఉపాసన పుట్టింట్లో జరిగింది.

రామ్ చరణ్ , ఉపాసనల గారాలపట్టి నామకరణ వేడుక సందర్భంగా అంబానీ కుటుంబం కోటీ విలువైన బంగారు ఉయ్యాలని బహుమతిగా ఇచ్చిందని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వార్తలో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read More: Kobbari Vadalu: రుచికరమైన కొబ్బరి వడలు.. తయారు చేయండిలా?