Site icon HashtagU Telugu

MS Dhoni: ధోని సరికొత్త అవతార్.. ‘అధర్వ’ లుక్ ట్రెండింగ్!

Dhoni

Dhoni

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన గ్రాఫిక్ నవల ‘అథర్వ: ది ఆరిజిన్‌’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశాడు. రమేష్ తమిళ్మణి రాసిన ఈ సిరీస్‌ను విన్సెంట్ అడైకలరాజ్, అశోక్ మనోర్ నిర్మించారు. గతంలో ఎన్నడూ చూడని అవతార్‌లో ఈ మాజీ క్రికెటర్ కనిపించనున్నాడు. అథర్వ ఫస్ట్ లుక్ విడుదల తర్వాత, అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ను సరికొత్త అవతార్‌లో చూపించినందున తెగ ఆనందపడిపోతున్నారు. ఫస్ట్ లుక్‌లో ధోని యుద్ధభూమిలో యానిమేటెడ్ అవతార్‌లో కనిపించాడు.

“నా కొత్త అవతార్..అథర్వను ప్రకటించినందుకు సంతోషంగా ఉంది” అని MS ధోని ఫేస్‌బుక్‌లో సిరీస్ నుండి ఫస్ట్ లుక్‌ను పంచుకున్నారు. ఎంఎస్ ధోని అభిమానులు మాజీ క్రికెటర్ కొత్త రూపాన్ని సమీక్షించడానికి ట్విట్టర్‌లోకి వెళ్లారు. ఈ యానిమేటెడ్ అవతార్‌లో మాజీ సారథిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుండటంతో సోషల్ మీడియాలో ధొని లుక్ ట్రెండ్ గా మారింది. ఈ గ్రాఫిక్ నవల త్వరలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ప్రీ-ఆర్డర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు.

https://twitter.com/praveen_5654/status/1489120356342251523?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1489120356342251523%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Fms-dhoni-shares-his-first-look-from-sci-fi-series-atharva-the-internet-cannot-keep-calm-1908205-2022-02-03