Site icon HashtagU Telugu

MS Dhoni: అథర్వగా ధోని.. యానిమేషన్ మూవీతో థ్రిల్లింగ్ అడ్వంచర్స్

Dhoni

Dhoni

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రధాన యానిమేషన్ పాత్రలో  కనిపించబోతున్నారు. ‘అథర్వ’ అనే సైన్స్ ఫిక్షన్స్  గ్రాఫిక్ నవల అథర్వగా ఎం.ఎస్.ధోని లుక్ ఇప్పటికే అందరిన్నీ ఆకట్టుకుంది. సిరీస్‌గా రానున్న ఈ వెబ్ సిరీస్‌లో ఎం.ఎస్.ధోని అథర్వ.. ది ఆరిజన్’ యానిమేటేడ్ రూపంలో అభిమానులను అలరించనున్నారు. దీన్ని ధోని ఎంర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ నవలను రమేష్ తమిళమణి రచించారు.

అనుభవజ్ఞుడైన ఓ యోధుడు సుదీర్ఘ ప్రయాణంలో వింత జీవులను ఎదుర్కొంటాడు, అద్భుతమైన విషయాలను కనుగొన్నాడు. వీటి ఆధారంగా సినిమా రాబోతోంది. ఈ “అత్యున్నత ఫాంటసీ జానర్ ప్రారంభ దశలోనే ఉంది. MS ధోని వంటి స్టార్ కథానాయకుడిగా నటిస్తుండటంతో ఆసక్తి కలిగిస్తోంది. ఈయన ఐపీఎల్‌లో ‘చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ధోనీ ఆధర్వంలోనే ఈ టీమ్ ఎక్కువ సిరీస్‌లను కైవసం చేసుకుంది. ధోని యానిమేషన్ మూవీలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో జోష్ నింపింది.