MS Chowdary : ప్రభాస్ నా కాళ్లు పట్టుకున్నాడు.. సలార్ 1 లో ఆ సీన్ డూప్ లేకుండా అలా చేయడమంటే..!

M.S Chowdary ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ (Salaar) సినిమా థియేట్రికల్ వెర్షన్ డిసెంబర్ 22న రిలీజ్ కాగా 600 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్

Published By: HashtagU Telugu Desk
Ms Chowdary About Prabhas Salaar Prashanth Neel

Ms Chowdary About Prabhas Salaar Prashanth Neel

M.S Chowdary ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ (Salaar) సినిమా థియేట్రికల్ వెర్షన్ డిసెంబర్ 22న రిలీజ్ కాగా 600 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే థియేట్రికల్ వెర్షన్ పూర్తి చేసుకుని రీసెంట్ గా ఓటీటీలో రిలీజైంది సలార్ 1 సీజ్ ఫైర్. డిజిటల్ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి ఒక్కసారిగా సినిమా చూసే వారి సంఖ్య ఎక్కువైంది. నెట్ ఫ్లిక్స్ లో సలార్ 1 సత్తా చాటుతుంది.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఈ సినిమా ఓటీటీ లో ట్రెండ్ అవుతున్న టైం లో సినిమాలో నటించిన M.S చౌదరి ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. అందులో ప్రభాస్ (Prabhas) గురించి అతను చేసిన కామెంట్స్ పై స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ ని తను కొట్టే సీన్ ఉందని. సినిమాలో అతన్ని కొట్టింది తను ఒక్కడినే అని అన్నారు. అంతేకాదు సినిమాలో అతని కాళ్లు పట్టుకునే సీన్ ఒకటి ఉంది. అయితే ఆ సీన్ డూప్ పెట్టి చేయమని చెప్పగా ప్రభాస్ పర్లేదు తనే చేస్తానని తన కాళ్లు పట్టుకున్నాడని చెప్పారు M.S చౌదరి.

సలార్ 1 సీజ్ ఫైర్ లో ఎంబి చౌదరి పాత్ర ముగిసింది. అయితే సలార్ 1 కి రెండింతలు సలార్ 2 ఉంటుందని సినిమా పార్ట్ 2 కచ్చితంగా ఏ రికార్డ్ మిగల్చదని చెబుతున్నారు M.S చౌదరి. తెలుగు తమిళ కన్నడ భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుతున్న M.S చౌదరి సలార్ 1 లో నారంగ్ పాత్రలో నటించారు.

Also Read : Boyapati Srinu : ఇట్స్ అఫీషియల్ గీతా ఆర్ట్స్ లో బోయపాటి.. హీరో ఎవరు మరి..?

  Last Updated: 26 Jan 2024, 09:47 PM IST