ధనుష్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ ఠాకూర్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ పోస్ట్!

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారిన నటి మృణాల్ ఠాకూర్, తమిళ స్టార్ హీరో ధనుష్ పెళ్లి వార్తలపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, వచ్చే నెల ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి పీటలెక్కబోతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని మృణాల్ బృందం తీవ్రంగా ఖండించింది.

అసలేం జరిగింది?

‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలపై పరోక్షంగా స్పందించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేస్తూ.. “Grounded, glowing and unshaken!” (నిబ్బరంగా, మెరుస్తూ- చలించకుండా!) అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. విశేషమేమిటంటే.. ఈ పోస్ట్‌కు ఆమె ధనుష్ నటించిన పాత సినిమా ‘ఆయుధ ఎళుత్తు’ (తెలుగులో ‘యువ’) చిత్రంలోని ప్రసిద్ధ పాట ‘యాక్కై తిరి’ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా ఎంచుకుంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమె తనపై వస్తున్న పుకార్లను చాలా హుందాగా, ధైర్యంగా ఎదుర్కొంటున్నారని ప్రశంసిస్తున్నారు.

Also Read: మ‌రోసారి బ‌య‌ట‌ప‌డిన టీమిండియా బ‌ల‌హీన‌త.. ఏంటంటే?

టీమ్ స్పష్టత

మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్తలు శృతిమించడంతో ఆమె పిఆర్ (PR) టీమ్ రంగంలోకి దిగింది. “మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవడం లేదు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో పుట్టించిన పుకారు ఇది. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలను నమ్మకండి. ఆమె ప్రస్తుతం తన కెరీర్‌పై, చేతిలో ఉన్న ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారించింది” అని మృణాల్ టీమ్ సభ్యుడు ఒకరు స్పష్టంగా వెల్లడించారు.

అభిమానుల మద్దతు

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున మృణాల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. “మీరు చాలా హుందాగా సమాధానం ఇచ్చారు”, “ఎప్పుడూ ఇలాగే స్థిరంగా ఉండండి” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ధనుష్- మృణాల్ మధ్య డేటింగ్ గురించి ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ వచ్చే నెలలో జరగబోయే పెళ్లి మాత్రం కేవలం పుకారు మాత్రమేనని తేలిపోయింది.

కెరీర్ పరంగా..

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. తన నటనతో, వ్యక్తిత్వంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఇలాంటి అనవసరపు వార్తలకు తన పనితోనే సమాధానం చెబుతానని పరోక్షంగా చాటిచెప్పింది. ఏదేమైనా ఈ వార్తతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారానికి తెరపడినట్లయింది.

  Last Updated: 18 Jan 2026, 08:29 PM IST