బాలీవుడ్ నుంచి టాలీవుడ్ షిఫ్ట్ అయిన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఇక్కడ వరుస ఛాన్సులతో అదరగొట్టేస్తుంది. హిందీలో సీరియల్స్ లో నటించి అక్కడ టాలెంట్ చూపించి సిల్వర్ స్క్రీన్ ఛాన్సెస్ అందుకున్న అమ్మడు హిందీలో నటిస్తూ తెలుగులో సీతారామం ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాలో అమ్మడి నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు. ఆ సినిమా హిట్ తో మృణాల్ కి వరుస ఛాన్సులు రాగా అందుకు తగినట్టుగానే అమ్మడు తన నటనతో మెప్పిస్తూ వస్తుంది.
మృణాల్ ఠాకూర్ ఇప్పటివరకు తెలుగులో 3 సినిమాలు చేయగా అందులో రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా అంచనాలను అందుకోలేదు. ఐతే మృణాల్ తన సోషల్ మీడియాలో తను ఎక్కువగా చేస్తున్న సినిమా గురించి పోస్ట్ పెట్టింది. ఈమధ్య తను ఎక్కువగా ఈ సినిమా చూస్తున్నా అంటూ నాని హాయ్ నాన్న చూస్తున్న ఫోటోని షేర్ చేసింది మృణాల్.
శౌర్యువ్ డైరెక్షన్ లో నాని (Nani) హీరోగా మృణాల్ నటించిన సినిమా హాయ్ నాన్న (Hi Nanna). నాని స్టోరీ జడ్జిమెంట్ ఎంత బ్రిలియంట్ గా ఉంటుంది అన్నది ఈ సినిమా చూశాకే మరోసారి ప్రూవ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో తన పాత్రతో మెస్మరైజ్ చేసింది. సినిమాలో తన నటనకు మంచి ప్రశంసలు అందాయి. ఐతే ఈమధ్య కాలంలో తనకు బాగా నచ్చిన సినిమా ఇదే అని.. అందుకే ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా ఎక్కువగా నాని హాయ్ నాన్ననే చూస్తా అంటుంది మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం మృణాల్ తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ లో నటించడానికి సిద్ధమవుతుంది. ఓ పక్క బాలీవుడ్ (Bollywood) నుంచి కూడా ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో క్లిక్ అవ్వడం వల్ల అమ్మడికి బాలీవుడ్ నుంచి డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ మంచి ఛాన్స్ వచ్చినా కాదనకుండా చేయాలని చూస్తుంది మృణాల్. ఓ విధంగా అమ్మడికి ప్రస్తుతం టైం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు.
Also Read : Mahesh Babu Praises Kalki Team : కల్కి పై మహేష్ క్రేజీ కామెంట్స్.. మైండ్ బ్ల్యూ అవే అంటూ..!