Site icon HashtagU Telugu

Mrunal Thakur: పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి షాకిచ్చిన మృణాల్ ఠాకూర్.. అసలు విషయం తెలియడంతో?

Mrunal Thakur

Mrunal Thakur

మృణాల్ ఠాకూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు భారీగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలలో నటించింది. ఈ సినిమాలు కూడా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇకపోతే ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పెళ్లికూతురు గెటప్ లో ఉన్న వీడియోస్ షేర్ చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.

ఆ ఫొటోస్ వీడియోస్ వైరల్ అవ్వడంతో ఈమె పెళ్లి పీటలు ఎక్కుతోందా? వరుడు ఎవరు లాంటి కామెంట్లు చేసారు. అయితే ఆ ఫోటోలను వీడియోలను షేర్ చేసిన ఆమె వాటి కింద క్యాప్షన్ లో లాస్ట్ దే ఆఫ్ ద షూట్ అని.. పెట్టి మొత్తానికి ఇది ఏదో అడ్వటైజ్మెంట్ షూట్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న అభిమానులు ఊపిరి పిలుచుకుంటున్నారు. అయితే కింద క్యాప్షన్ చదవకుండా చాలా మంది పెళ్లి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి పెళ్లికూతురు గెటప్ లో మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంది. ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ గా మారాయి.