Mrunal Thakur : రౌడీ బాయ్ విజయ్ తో పనిచేయడం ప్రతి హీరోయిన్ కల – మృణాల్

'ఈ సినిమాలో 'ఇందు'గా మీ ముందుకు వస్తున్నాను. మొదటి 15 రోజులు ఈ పాత్ర చాలా ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరని అనిపించింది

Published By: HashtagU Telugu Desk
Mrunal Speech

Mrunal Speech

రౌడీ బాయ్ విజయ్ (Vijay Devarakonda) తో పనిచేయడం ప్రతి హీరోయిన్ కల అని చెప్పుకొచ్చింది సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). వరుస విజయాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న మృణాల్..సీతారామం మూవీ లో మృణాల్ నటనకు యూత్ మాత్రమే కాదు ఫామిలీ ఆడియన్స్ సైతం ఎంతో ఫిదా అయ్యారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడం , మృణాల్ కు మంచి మార్కులు పడడంతో తెలుగు లో వరుస సినిమాలు ఆమె తలుపు తడుతున్నాయి. రీసెంట్ గా హాయ్ నాన్న తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ (Family Star) తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – మృణాల్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 05 న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లలో అదరగొడుతున్న మృణాల్..మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తన మాటలతో అందర్నీ మాయ చేసింది. ముఖ్యంగా రౌడీ బాయ్ విజయ్ ఫ్యాన్స్ అయితే మృణాల్ కు గుడి కట్టాలి అన్నట్లు హ్యాపీ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

‘నన్ను అందరూ మీ తెలుగమ్మాయిగా అంగీకరించారు కాబట్టే నేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ప్రేమను మీరు నాపై చూపిస్తున్నారు. మీ అందరిపట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో కలిగి ఉంటాను. తెలుగు వారందరికీ ధన్యవాదాలు.’ అని తెలిపింది. . ‘ఈ సినిమాలో ‘ఇందు’గా మీ ముందుకు వస్తున్నాను. మొదటి 15 రోజులు ఈ పాత్ర చాలా ఇబ్బంది అనిపించింది. కానీ తర్వాత ఈ పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరని అనిపించింది. విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాలని ప్రతి హీరోయిన్‌ అనుకుంటుంది. కానీ ఫ్యామిలీస్టార్‌తో నాకు ఆ అవకాశం దక్కింది. అలాగే దిల్‌ రాజు గారితో ఇది నాకు రెండో సినిమా.. అవకాశం వస్తే మూడో సినిమా కూడా చేయాలని ఉంది. ఈ సినిమాను మా ఫ్యామిలీస్టార్‌ అయిన మా నాన్నగారికి డెడికేట్‌ చేస్తున్నాను.’ అని మృణాల్ పేర్కొంది. ఈమె మాటలకు విజయ్ అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్లే..ఇక మృణాల్ కు తీరుగులేనట్లే..

Read Also : Mayank Yadav: ఎవరీ మయాంక్ యాదవ్.. మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నాడు..!

  Last Updated: 03 Apr 2024, 10:08 AM IST