Site icon HashtagU Telugu

Mrunal Thakur : మాజీ బోయ్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకుని హీరో చెంప చెల్లుమనిపించిన మృణాల్..!

Mrunal Thakur Another Lucky Chance

Mrunal Thakur Another Lucky Chance

Mrunal Thakur బాలీవుడ్ లో సీరియల్స్ చేసి ఆ క్రేజ్ తో సిల్వర్ స్క్రీన్ ఛాన్సులు అందుకున్న భామ మృణాల్ ఠాకూర్ సౌత్ లో తను ఊహించని ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు వరుస క్రేజీ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది. అయితే బాలీవుడ్ లో హృతిక్ తో జత కట్టిన మృణాల్ జెర్సీ రీమేక్ కోసం షాహిద్ కపూర్ తో కూడా రొమాన్స్ చేసింది.

మృణాల్ చిన్నప్పటి నుణి షాహిద్ కు వీరాభిమాని అట. అతనితో నటించే ఛాన్స్ రావడంతో సూపర్ ఎగ్జైట్ అయ్యిందట. మొదటి రోజు షూటింగ్ లో షాహిద్ నవ్వు చూస్తూ ఉండిపోయానని అన్నది మృణాల్. అయితే సినిమాలో ఒక సీన్ లో షాహిద్ ను చెంప మీద కొట్టాల్సి ఉంది. జెర్సీ తెలుగిలో నాని చెంప మీద కొట్టింది హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్.

అయితే ఇష్టమైన హీరోని చెంపపగలగొట్టడం ఇష్టం లేక మృణాల్ తాను లైట్ గా టచ్ చేస్తా ఎడిటింగ్ లో మీరు సెట్ చేయండని అన్నదట. కానీ షాహిద్ మాత్రం పర్లేదు మీ మాజీ బోయ్ ఫ్రెండ్ ని గుర్తు తెచ్చుకుని కొట్టండని సలహా ఇచ్చాడట. డైరెక్టర్ కూడా కచ్చితంగా కొట్టాల్సిందే అని చెప్పడంతో లాగి పెట్టి చెంపె చెల్లిమనిపించిందట మృణాల్.

ఆ సీన్ కోసం దాదాపు 3 గంటలు కష్టపడిందట మృణాల్. అయితే షాహిద్ చెప్పిన సలహాతోనే తన మాజీ బోయ్ ఫ్రెండ్ తోనే ఆమె ఈ సీన్ చేసి ఉండొచ్చని అందరు అనుకున్నారట. మొత్తానికి షాహిద్ చెంప మీద మృణాల్ దెబ్బ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది.

Also Read : Srileela Special Song : శ్రీలీల స్పెషల్ సాంగ్.. ఏ సినిమా కోసమో తెలుసా..?