Site icon HashtagU Telugu

Mrunal Thakur : పెళ్లి, పిల్లలకి జన్మనివ్వడంపై మృణాల్ వైరల్ కామెంట్స్.. తన ఎగ్స్‌ని ఫ్రీజ్ చేస్తా అంటూ..

Mrunal Thakur Said She Is Considering Freezing Her Eggs

Mrunal Thakur Said She Is Considering Freezing Her Eggs

Mrunal Thakur : అందాల భామ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ టు టాలీవుడ్ సినిమా అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాగా ఈ హీరోయిన్ రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మృణాల్.. పెళ్లి, పిల్లలకి జన్మనివ్వడంపై మృణాల్ వైరల్ కామెంట్స్ చేసారు. ఇటీవల బాలీవుడ్ నటి మోనా సింగ్ తన ఎగ్స్‌ని ఫ్రీజ్ చేయడం గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఎగ్స్ ని ఫ్రీజ్ చేయడం అంటే ఏంటంటే.. తల్లి అవ్వడానికి కారణమయ్యే అండంని మహిళ నుంచి సేకరించి ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఆ తరువాత పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు ఆ అండంని బయటకి తీసి.. దానిలోకి ఆ మహిళకి సంబంధించిన మగవ్యక్తి వీర్యకణాలను ఇంజెక్ట్ చేసి, ఆ అండంని మహిళ గర్భంలోకి పంపించడం లేదా టెస్ట్ ట్యూబ్ ద్వారా జన్మనివ్వడం జరుగుతుంది.

ఈక్రమంలోనే మృణాల్ కూడా తన ఎగ్స్ ని ఫ్రీజ్ చేస్తాను అంటున్నారు. ఇంటర్వ్యూలో మోనా సింగ్ కామెంట్స్ ప్రస్తావన రావడంతో.. ఆమె వాటిని సమర్థిస్తూ ఈ కామెంట్స్ చేసారు. “ప్రస్తుత కాలంలో రిలేషన్ షిప్స్ అనేవి క్లిష్టతరంగా మారాయి. ఇలాంటి సమయంలో మన జాబ్ ని అర్థంచేసుకొనే మంచి పార్ట్నర్ ని వెతుకోవడం కొంచెం కష్టమైన పని. అందుకనే ఎగ్స్ ని ఫ్రీజ్ చేయడం అనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ తమ ఆలోచనలను తెలియజేస్తూ పలు కామెంట్స్ చేస్తున్నారు. కాగా మృణాల్ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో రీసెంట్ గా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా తరువాత మరే తెలుగు సినిమాకి ఈమె ఇంకా సైన్ చేయలేదు. తెలుగులో మరో సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

Also read : NTR : ఓయ్ అంటూ కోపంతో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!