Mrunal Thakur : నా పేరెంట్స్ వల్ల నేను చాలా సినిమాలు వదులుకున్నాను.. కారణం ఏంటంటే..

తన తల్లిదండ్రులు వల్ల మృణాల్ ఠాకూర్ చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట. అందుకు కారణం ఏంటంటే..

Published By: HashtagU Telugu Desk
Mrunal Thakur Missed So Many Movies Due To Her Parents

Mrunal Thakur Missed So Many Movies Due To Her Parents

Mrunal Thakur : బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్.. మరాఠి సినిమాలతో యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఆ తరువాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఇక ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్.. సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నారు. సీతగా తెలుగు కుర్రాళ్ళ మనసుని దోచుకున్నారు. ఆ తరువాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు కూడా చేసారు.

2014లో సినీ అరంగేట్రం చేసిన మృణాల్.. ఈ దశాబ్ద కాలంలో చాలా తక్కువ సినిమాలే చేసారు. అయితే ఇలా తక్కువ సినిమాలు చేయడానికి కారణం.. అవకాశాలు రాక కాదు, తన పేరెంట్స్ వల్ల మృణాల్ చాలా సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట. సినిమాలో నటించడానికి ఓకే చెప్పిన మృణాల్ తల్లిదండ్రులు.. లిప్ లాక్ సీన్స్ కి మాత్రం నో చెప్పారట. ఇక ఈ నిర్ణయం వల్ల మృణాల్ చాలా సినిమాలకు నో చెప్పారట.

ఇలా ఎన్నో సినిమాలను వదులుకున్న తరువాత మృణాల్ కి ఒక విషయం అర్థమైందట. కొన్నిసార్లు ఆ సన్నివేశానికి ముద్దు సీన్ అవసరం. అది చేయక తప్పదు అని తెలుసుకున్నారట. ఆ విషయానే మృణాల్ తన పేరెంట్స్ కి అర్థమయ్యేలా తెలియజేశారట. ఆ తరువాత మృణాల్ తల్లిదండ్రుల నుంచి కూడా ముద్దు సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మృణాల్ ఈమధ్య కాలంలో లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాలు చాలానే చేసారు.

ఇలా చేసిన వాటిలో తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. హాయ్ నాన్న సినిమాలో నానికి లిప్ లాక్ ఇచ్చిన మృణాల్.. ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండతో కూడా ముద్దు సీన్ లో నటించారు. అయితే మృణాల్ ని సీతగా చూసిన తెలుగు కుర్రాళ్ళు.. ఆ ముద్దు సీన్స్ ని అంగీకరించలేకపోతున్నారు.

  Last Updated: 30 Apr 2024, 02:17 PM IST