బాలీవుడ్ (Bollywood) లో సోసోగా కెరీర్ లాగిస్తున్న మృణాల్ ని తెచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ని చేశాడు డైరెక్టర్ హను రాఘవపుడి. ఆయన చేసిన సీతారామం సినిమాతో అమ్మడు ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ అందుకోగా నెక్స్ట్ హాయ్ నాన్నతో కూడా మరో సక్సెస్ ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్ నిరాశపరిచింది. ఐతే ఆ సినిమా ఫ్లాప్ తో మృణాల్ (Mrunal Thakur) కి షాక్ తగిలింది. నెక్స్ట్ సినిమా ఆఫర్లు మందిగించాయి.
ఓ పక్క బాలీవుడ్ లో ఆల్రెడీ సినిమాలు చేస్తున్న అమ్మడు తెలుగులో అవకాశాలు లేకపోవడం వల్ల డీలా పడుతుంది. ఐతే ఇలాంటి టైం లో కూడా ఎక్కడ తగ్గకుండా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన శారీ లుక్ ఫోటోలతో ఫాలోవర్స్ కి కిక్ ఇచ్చింది. చీరలో మృణాల్ ఠాకూర్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడు కలర్ మ్యాచింగ్ టేస్ట్ కి సెపరేట్ ఫ్యాన్ క్రేజ్ ఉంది.
శారీలో కూడా అమ్మడు తన క్రేజీ లుక్స్ తో అలరిస్తుంది. సీతారామం, హాయ్ నాన్న (Hi Nanna) రెండు హిట్లు కొట్టినా కూడా మృణాల్ కి ఎందుకో వరుస అవకాశాలు రావట్లేదు. ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ గట్టిగా పడినట్టే ఉంది. ఐతే అవకాశాలు ఉన్నా లేకపోయినా మృణాల్ మాత్రం తన ప్రయత్నాలు ఆపట్లేదు. మృణాల్ చేస్తున్న ఈ ఫోటో షూట్స్ వల్ల ఆమెను ఇష్టపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది.