Mrunal Thakur : మృణాల్ గ్లామర్ కి ఒక లెక్క ఉందంతే..!

Mrunal Thakur సీతారామం తో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో తనకున్న బోల్డ్ ఇమేజ్ కి దూరంగా ఇక్కడ సినిమాలు చేస్తుంది. సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాలు

Published By: HashtagU Telugu Desk
Mrunal Thakur Latest Glamour Treat For Face Magazine

Mrunal Thakur Latest Glamour Treat For Face Magazine

Mrunal Thakur సీతారామం తో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో తనకున్న బోల్డ్ ఇమేజ్ కి దూరంగా ఇక్కడ సినిమాలు చేస్తుంది. సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాలు చేసి రెండితో హిట్లు అందుకున్న మృణాల్ ఠాకూర్ ఓ పక్క సినిమాలతో పాటు గ్లామర్ షోలో రెచ్చిపోతుంది. ముఖ్యంగా ఫోటో షూట్స్ తో అడ్డు గోడలను చెరిపేసి అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మృణాల్ ఫోటో షూట్ చేస్తే చాలు అలా వైరల్ అయిపోతున్నాయి. కెరీర్ లో సినిమాలతో పాటు ఫోటో షూట్స్ తో కూడా మెప్పిస్తుంది అమ్మడు.

లేటెస్ట్ గా ఫేస్ మేగజైన్ కోసం మృణాల్ క్రేజీ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ చూసిన వారెవరైనా మృణాల్ గ్లామర్ కి ఫిదా అవ్వకుండా ఉండలేరు. తెర మీద నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న అమ్మడు ఫోటో షూట్ అంటే చాలు గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. ఆమె చేస్తున్న ఈ షో ఆమెకు మరింత మైలేజ్ వచ్చేలా చేస్తుంది. ఫేస్ మేగజైన్ కోసం మృణాల్ చేసిన ఈ క్రేజీ ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దేవరకొండ హీరోతో చేసిన ది ఫ్యామిలీ స్టార్ తో నిరాశపరచిన మృణాల్ రిజల్ట్ ఎలా ఉన్నా సినిమాలో అమ్మడి యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. తెలుగులో నెక్స్ట్ సినిమా డిస్కషన్స్ లో ఉన్నాయి. ఐతే బాలీవుడ్ లో మాత్రం మృణాల్ ఠాకూర్ కి తను కోరుకుంటున్న ఆఫర్లు రావట్లేదు. ఈ విషయంలో అమ్మడు కాస్త డిజప్పాయింటెడ్ గా ఉంది. హిందీలో కూడా తెలుగులో వచ్చినట్టుగా కథాబలం ఉన్న సినిమాలు వస్తే తన సత్తా చాటుతా అంటుంది అమ్మడు.

Also Read : Amitabh Bacchan : అమితాబ్ కి ఊపు తెచ్చిన కల్కి..!

  Last Updated: 30 Jun 2024, 02:21 PM IST