Mrunal Thakur : మృణాల్ మళ్లీ పెంచేసిందా.. అమ్మడు డిమాండ్ కి షాక్ అవుతున్న నిర్మాతలు..!

Mrunal Thakur బాలీవుడ్ లో సీరియల్స్ చేసి ఆ పాపులారిటీతో అక్కడ సినిమాల్లో నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం తో సూపర్ హిట్ అందుకుంది.

Published By: HashtagU Telugu Desk
Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur బాలీవుడ్ లో సీరియల్స్ చేసి ఆ పాపులారిటీతో అక్కడ సినిమాల్లో నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన సీతారామం తో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తో తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత నాని తో కలిసి హాయ్ నాన్న లో నటించింది. ఆ సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో మృణాల్ తెలుగులో లక్కీ హీరోయిన్ అయ్యింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో అమ్మడు నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజైంది.

సమ్మర్ సినిమాల రేసులో దిగిన ఫ్యామిలీ స్టార్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే సీతారామ, హాయ్ నాన్న సినిమాలు హిట్ పడగానే మృణాల్ తన రెమ్యునరేషన్ పెంచింది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మళ్లీ తన పారితోషికం పెంచినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ స్టార్ కోసం 3 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్న మృణాల్ ఆ సినిమా తర్వాత 5 కోట్లు డిమాండ్ చేస్తుందట.

అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారు. తెలుగులో నటించిన 3 సినిమాల్లో రెండు హిట్లు అవ్వడం వల్ల మృణాల్ రేంజ్ అమాంతం పెరిగింది. తెలుగులో ఆమెను లక్కీ హీరోయిన్ అంటున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ తో మొదటి ఫెయిల్యూర్ ఫేస్ చేసిన మృణాల్ తర్వాత సినిమాల విషయంలో జాగ్రత్త పడాలని చూస్తుంది.

ఇక హను రాఘవపుడి ప్రభాస్ కలయికలో రాబోతున్న సినిమాలో కూడా మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. సీతారామం హిట్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో ఫిక్స్ చేసుకున్న హను ప్రస్తుతం ఆ సినిమా కథ పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యి ఉన్నాడు.

Also Read :Pushpa Raj : సోలోగానే పుష్ప రాజ్.. ఆ సాహసం ఎవరు చెయ్యట్లేదు..!

  Last Updated: 12 Apr 2024, 11:15 PM IST