Site icon HashtagU Telugu

Mrunal Thakur : మృణాల్ డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది..!

Star Heroine Missed Sitharamam Chance Do you Know Who is that

Star Heroine Missed Sitharamam Chance Do you Know Who is that

Mrunal Thakur సీతారామం తో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఆ సినిమా హిట్ తో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది. రెండ్య్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తెలుగులో మృణాల్ సూపర్ పాపులర్ అయ్యింది. ఆమె సినిమాలో ఉంటే సినిమాలో హిట్టే అన్న టాక్ వచ్చేసింది. మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుంది. ఈ సినిమా మార్చిలో రిలీజ్ ప్లాన్ చేశారు.

ఇప్పటికే రెండు వరుస హిట్లు అందుకున్న మృణాల్ థర్డ్ హిట్ కూడా అందుకుంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నట్టు అవుతుంది. మృణాల్ ఠాకూర్ వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక స్టార్ ఆన్ డిమాండ్ అన్నట్టుగా తనకు వచ్చిన ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో తెలివి చూపిస్తుంది అమ్మడు. సీతారామం కి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న మృణాల్ హాయ్ నాన్నకి కోటి పైగా తీసుకుందని టాక్.

ఫ్యామిలీ స్టార్ కోసం కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ పడితే మాత్రం మృణాల్ ఠాకూర్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం యువ హీరోలతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మృణాల్ స్టార్ ఛాన్స్ లతో సత్తా చాటాలని చూస్తుంది. మరి మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది చూడాలి.

Also Read : Samantha : సమంత వాటికి ఓకే కానీ..?

We’re now on WhatsApp : Click to Join