Site icon HashtagU Telugu

Mrunal Thakur : వయసులో చిన్నదైనా శ్రీలీలను చూసి స్ఫూర్తి పొందుతున్న మృణాల్ ఠాకూర్.. ఎందుకంటే?

Mrunal Thakur Appreciate Sreeleela and said she inspires from her Post Goes Viral

Mrunal Thakur Appreciate Sreeleela and said she inspires from her Mrunal Post Goes Viral

ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మృణాల్(Mrunal Thakur), శ్రీలీల(Sreeleela) ఇద్దరూ ముందు వరసలో ఉన్నారు. వీరిద్దరూ తెలుగు ప్రేక్షకులని మెప్పించి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు కొట్టేస్తున్నారు. ఇటీవల మృణాల్ హాయ్ నాన్న(Hi Nanna) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో వచ్చింది.

నాని, మృణాల్ జంటగా నటించిన హాయ్ నాన్న సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నాని, మృణాల్, చిత్రయూనిట్ ని అభినందిస్తూ పోస్ట్ చేసింది. దీనికి మృణాల్ ఠాకూర్ రిప్లై ఇస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. థాంక్యూ సో మచ్ స్వీట్ హార్ట్. నీకు సినిమా నచ్చినందుకు సంతోషిస్తున్నాను. నేను నిన్ను చూసి స్ఫూర్తి పొందుతున్నాను. ఓ పక్క నటిస్తూనే మరో పక్క చదువుకుంటున్నావు. ఇది అంత ఈజీ కాదు, చాలా గర్వపడుతున్నాను నిన్ను చూసి అని పోస్ట్ చేసింది.

దీంతో మృణాల్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. దీనికి శ్రీలీల థ్యాంక్యూ చెప్తూ రిప్లై పోస్ట్ కూడా పెట్టింది. ఇక శ్రీలీల ఓ పక్క వరుస సినిమాలు చేస్తూ మరోపక్క MBBS చదువుతున్న సంగతి తెలిసిందే. దీంతో అంతా ఆమెని అభినందిస్తున్నారు.

 

Also Read : Shahrukh Khan : మొన్న వైష్ణోదేవి.. ఇవాళ షిర్డీ సాయిబాబా.. ఆలయాలకు క్యూ కడుతున్న షారుఖ్..