సీతారామం తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సూపర్ క్రేజ్ సంపాధించింది. ఓ పక్క బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్నా తెలుగులో కూడా హాయ్ నాన్న(Hi Nanna) , ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసింది. హాయ్ నాన్న సక్సెస్ కాగా ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ నిరాశపరచింది. ఐతే ఇప్పుడు అమ్మడు తెలుగు కన్నా హిందీలో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అక్కడ దాదాపు 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
ఇదే కాకుండా కోలీవుడ్ నుంచి క్రేజీ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. సూర్య (Surya) హీరోగా ఆర్జే బాలాజి (RJ Balaji) డైరెక్షన్ లో రాబోతున్న భారీ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. అసలైతే సూర్య నటించిన కంగువలో మృణాల్ నటించాల్సి ఉన్నా ఆ సినిమా టైం లో డేట్స్ క్లాష్ వల్ల ఆ ఛాన్స్ వదులుకుంది.
సూర్య సినిమా ఆఫర్..
ఐతే ఇప్పుడు మరోసారి సూర్య సినిమా ఆఫర్ రాగానే చేస్తానని సైన్ చేసింది. చిన్నగా తెలుగు నుంచి తమిళ పరిశ్రమకు షిఫ్ట్ అవుతుంది మృణాల్. ఓ పక్క గ్లామర్ తో పాటు అభినయంలో కూడా అదరగొట్టేస్తున్న మృణాల్ (Mrunal Thakur) సినిమాలో ఉంది అంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకుంది.
మృణాల్ ఠాకూర్ కూడా ఎక్కడ ఛాన్స్ వచ్చినా సరే కాదనకుండా చేస్తుంది. ఐతే తెలుగు ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమ కారణంగా ఎక్కువగా ఇక్కడ సినిమాలు చేయాలని అనుకుంటుంది.
Also Read : Trivikram : లక్కీ భాస్కర్ అతిథిగా త్రివిక్రం..!