Site icon HashtagU Telugu

Mrunal Thakur : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మృణాల్

Mrunal Bakmpet

Mrunal Bakmpet

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) బల్కంపేట ఎల్లమ్మ ఆలయం (Balkampet Yellamma Temple)లో సందడి చేసింది. సీతారామం మూవీ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ బ్యూటీ..ప్రస్తుతం తెలుగు లో వరుస సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా హాయ్ నాన్న తో ఆకట్టుకోగా..ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ (Family Star) తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – మృణాల్ జంటగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ కు సిద్ధమైంది టీమ్. ఈ క్రమంలో ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృణాల్ ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు మృణాల్ కు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు..మృణాల్ తో సెల్ఫీ లు దిగేందుకు పోటీ పడ్డారు.

ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మిడిల్ క్లాస్ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ నటించారు. ఇటీవలే వచ్చిన ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్ కూడా ఈ మూవీలో ఉండనుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ర్యాప్‍తో వచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంది. మృణాల్ ఠాకూర్ మరోసారి బ్యూటిఫుల్‍గా కనిపించారు. ఈ టీజర్లో పెట్రోల్ డైలాగ్ బాగా వైరల్ అయింది. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన నందనందనా సాంగ్ బాగా హిట్ అయింది. ఈ చిత్రానికి క్రేజ్ తీసుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 05 వరకు వెయిట్ చేయాల్సిందే.