Site icon HashtagU Telugu

Mrunal Thakur : తండ్రికి అలా చెప్పి ఇక్కడికి వచ్చాక ఇలా చేస్తుందా..?

Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur Watching her Favourite movie

Mrunal Thakur సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత నాని తో హాయ్ నాన్న అంటూ మరో హిట్ కూడా అందుకుంది. థర్డ్ మూవీగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరచగా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తుంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలాఉంటే బాలీవుడ్ లో కూడా మృణాల్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.

ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో సినిమాల్లోకి వెళ్లేప్పుడు తండ్రికి ఇచ్చిన మాట గురించి చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ లో నటించనని తండ్రికి మాటిచ్చిందట మృణాల్ ఐతే మొదట్లో అలాంటి ఛాన్సులు వస్తే కాదని చెప్పడం వల్ల సినిమా ఆవకాశాలు రాలేదని అందుకే ఛాన్సుల కోసం నాన్నకు ఇచ్చిన మాట పక్కన పెట్టాల్సి వచ్చిందని మృణాల్ చెప్పుకొచ్చారు.

బాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ చేయకుండా హీరోయిన్ గా నెగ్గుకు రావడం చాలా కష్టం. సో మృణాల్ కూడా అదే దారిలో అదరగొట్టేస్తుంది. తెలుగులో మాత్రం తనకు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తున్నందుకు సంతోషంగా ఉన్నానని అంటుంది మృణాల్.

Also Read : Deepika Padukone : వేర్ ఈజ్ దీపికా.. కల్కిలో ఆమె ఉందా లేదా..?