Site icon HashtagU Telugu

Valentine’s Day : మాస్ మహారాజా ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్’ మాములుగా లేదు..

Mr Bachhan

Mr Bachhan

మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఫ్యాన్స్ కు ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్’ (Valentine’s Day) ను అందజేశారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేక బాధపడుతున్న రవితేజ..తాజాగా ఈగల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమేనేని డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ..ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) మూవీ చేస్తున్నాడు. గతంలో హరీష్ (Harish Shankar) – రవితేజ కలయికలో షాక్ , మిరపకాయ్ మూవీస్ వచ్చాయి. ఈ రెండిటిలో మిరపకాయ్ సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చాల గ్యాప్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండడం తో అంచానాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్’ సందర్బంగా మేకర్స్ సినిమా తాలూకా ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. ఈ పోస్టర్‌లో రవితేజ హీరోయిన్‌కు టైట్ హగ్ ఇస్తూ కనిపించాడు. ఇక, ఈ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ ‘ఎంతటి మాస్ పర్సన్ అయినా సాఫ్ట్ హార్ట్‌ను కలిగి ఉంటారు. మిస్టర్ బచ్చన్ యూనిట్ నుంచి మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

Read Also : Bandla Ganesh : బండ్ల గణేష్ కు భారీ షాక్ ..ఏడాదిపాటు జైలు శిక్ష

Exit mobile version