Site icon HashtagU Telugu

Raviteja : మళ్ళీ స్పీడ్ పెంచేసిన రవితేజ.. ఒకే నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు..

Mr Bachchan Star Raviteja Sign Two Projects In Sithara Entertainments

Mr Bachchan Star Raviteja Sign Two Projects In Sithara Entertainments

Raviteja : మాస్ మహారాజ రవితేజ గత రెండేళ్లలో ఏడాదికి మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి సందడి చేసారు. అయితే వీటిలో నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లో ‘ఈగల్’ సినిమాతో వచ్చిన రవితేజ.. యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలను లైనప్ లో రెడీగా పెట్టేసారు.

జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పారట. అలాగే సామజవరగమన రైటర్ భాను బోగవరపు కూడా రవితేజకి ఒక కథ వినిపించారట. అది కూడా బాగా నచ్చేయడంతో రవితేజ ఓకే చెప్పేసినట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ ని సితార ఎంటెర్టైమెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారట. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసి షూటింగ్ మొదలు పెట్టనున్నారట.

కాగా ఈ రెండు సినిమాలు కామెడీ జోనర్ లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. రవితేజ నుంచి ఓ కామెడీ ఎంటర్టైనర్ వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆయన కామెడీ టైమింగ్ ని బాగా మిస్ అవుతున్నారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు కామెడీ జోనర్ సినిమాలకు సైన్ చేయడంతో.. వింటేజ్ రవితేజని చూడబోతున్నామంటూ అభిమానులు ఖుషి అవుతున్నారు. మరి ఆ రెండు సినిమాలతో రవితేజ తన మార్క్ కామెడీతో అలరిస్తాడో లేదో చూడాలి.

ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’కి ఇది సీక్వెల్ గా వస్తుంది. 1980ల్లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మరి బాలీవుడ్ లో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం.. ఇక్కడ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Also read : Allu Arjun : బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పేందుకు.. అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా.. వీడియో వైరల్