Site icon HashtagU Telugu

Ravi Teja Birthday Special : ‘మిస్టర్‌ బచ్చన్‌’ ఫస్ట్ లుక్ రిలీజ్

Mr Bachchan First Look

Mr Bachchan First Look

మాస్ రాజా రవితేజ (Raviteja) పుట్టిన రోజు (Birtday) ఈరోజు. ఈ సందర్బంగా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan) మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదలై అభిమానులను అలరించింది. షాక్ , మిరపకాయ్ చిత్రాల తర్వాత రవితేజ (Raviteja) – హరీష్ శంకర్ (Harish Shankar) కలయికలో హ్యాట్రిక్ మూవీ గా ‘మిస్టర్‌ బచ్చన్‌’ తెరకెక్కుతుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ మూవీ లో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా..మిక్కీ జె మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్బంగా ‘మిస్టర్‌ బచ్చన్‌’ తాలూకా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో రవితేజ ఫైట్ సీన్ తో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే..మూవీ లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఇక చిత్రసీమలోకి ఒక్క ఛాన్స్ ..ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత హీరోగా పరిచయమై.. తనదైన అద్భుతమైన టాలెంట్లతో స్టార్‌గా ఎదిగిపోయాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా రవితేజ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తుంటాయి.

2022 చివర్లో ‘ధమాకా’తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన రవితేజ.. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’తోనూ భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే, 2023లో అతడు నటించిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు మాత్రం అంతగా ఆడలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ‘ఈగల్’ మూవీ చేశాడు. ఇది ఫిబ్రవరి 9న రాబోతుంది. మరి ఈ మూవీ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Read Also : Rashid Khan: గుజ‌రాత్ టైటాన్స్‌కు మ‌రో బిగ్ షాక్‌.. ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ ప్లేయ‌ర్‌..!