Site icon HashtagU Telugu

Bhagyashri Borse : ‘మిస్టర్ బచ్చన్’ భామ.. భారీ ఛాన్స్ కొట్టేసిందిగా.. ఏకంగా పాన్ ఇండియా సినిమాలో..

Bhagyashri Borse gets Chance in Rana Movie

Bhagyashree Borse

Bhagyashree Bhorse : మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమా ఫ్లాప్ అయినా హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. అందం, డ్యాన్సులు, నటన, ప్రమోషన్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ భాగ్యశ్రీ భోర్సే ప్రేక్షకులని మెప్పించింది. మిస్టర్ బచ్చన్ సినిమాలో ప్రేక్షకులని మెప్పించింది ఏదైనా ఉంది అంటే అది భాగ్యశ్రీ భోర్సే మాత్రమే. ఆమె అందానికి యువత అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది భాగ్యశ్రీ భోర్సే.

అయితే మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయో లేవో అనుకున్నారు. కానీ భాగ్యశ్రీ భోర్సేకి మంచి అవకాశాలే వస్తున్నాయంట. తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముంబై భామ. రానా, దుల్కర్ సల్మాన్ కలిసి ‘కాంత’ అనే సినిమాని చేస్తున్నారు. వేఫరెర్ ఫిలిమ్స్‌, స్పిరిట్ మీడియా సంయుక్త నిర్మాణంలో సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

తాజాగా నేడు కాంత సినిమా పూజ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో భాగ్యశ్రీ భోర్సే పాల్గొంది. రానా, దుల్కర్ లతో కలిసి భాగ్యశ్రీ భోర్సే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సేనే హీరోయిన్ గా నటిస్తుందట. దీంతో రెండో సినిమాకే పాన్ ఇండియా ఛాన్స్ కొట్టేసింది అని ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొడుతుందేమో చూడాలి.

 

Also Read : Deepika Padukone Baby News: పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన దీపికా ప‌దుకొణె..!