వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ..సంక్రాంతి బరిలో ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) ఫేమ్ బాబీ(Boby) కలయికలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 12న విడుదలయ్యింది. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, చాందినీ చౌదరి హీరోయిన్లు నటించారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం సినిమాకు హిట్ టాక్ రావడంతో మేకర్స్ , అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. ఇదే క్రమంలో సినిమా చూసిన రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు సినిమా పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎంపీ పురందేశ్వరి.. సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు కురిపించారు. బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్ లో సంక్రాంతి సందర్బంగా డాకు మహారాజ్ సినిమా చూశారు. తన సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసల జల్లులు కురిపించారు. డాకు మహారాజ్ సినిమా చూసిన తరువాత పురందేశ్వరి మాట్లాడుతూ.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక, సందేశాత్మక అంశాలతో మంచి సినిమా తీశారు. బాలకృష్ణ నటన అద్భుతంగా ఉంది. సేవ చేసిన వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అనేది ఈ సినిమాలో చూపించారు. నిరంతం సేవ చేసే వ్యక్తి ప్రజల మనసులో చిరకాల గుర్తుండిపోతారు. బాలకృష్ణ నటసింహం అని డాకు మహారాజ్ ద్వారా మరోసారి నిరూపితమైంది. బాలకృష్ణకు అభినందనలు. చిత్ర బృందానికి అభినందనలు. మంచి సినిమా తీసిన దర్శకుడు బాబీ, సినిమా నిర్మాతలకు కంగ్రాట్స్’ చెప్పారు.