Site icon HashtagU Telugu

Cinema News : వెయ్యి కోట్ల మార్కుని అందుకున్న సినిమాలివే.. తమిళ్ పరిశ్రమలో..

Tollywood, Indian 2, Kalki 2898 Ad

Tollywood, Indian 2, Kalki 2898 Ad

Cinema News : ఒకప్పుడు వంద కోట్ల కలెక్షన్స్ అనేవి ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మార్క్ ని ఒక్క రోజులోనే అందుకుంటున్నాయి కొన్ని సినిమాలు. ప్రస్తుతం వస్తున్న సినిమాల ముందు ఉన్న పెద్ద లక్ష్యం అంటే వెయ్యి కోట్ల మార్క్. బాహుబలి సినిమాతో రాజమౌళి రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి.. ఇతర ఫిలిం మేకర్స్ కి పెద్ద లక్ష్యాన్ని ఇచ్చారు. అయితే అక్కడి వరకు కాకపోయినా, కేవలం వెయ్యి కోట్ల మార్క్ ని అయినా అందుకుంటే చాలని ప్రస్తుతం సినిమాలు తెరకెక్కిస్తున్న మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

బాహుబలి తరువాత ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా వెయ్యికోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. బాహుబలి 2 రిలీజ్ తరువాత దంగల్ ని జపాన్ లో కూడా రిలీజ్ చేసారు. ఇక అక్కడ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఆ కలెక్షన్స్ ని కూడా జతచేసుకొని బాహుబలి 2 కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసింది. ఈ రెండిటి తరువాత కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి. వీటి తరువాత గత ఏడాది షారుఖ్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని అందుకొని సంచలనం సృష్టించాయి. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా వెయ్యి కోట్ల మార్క్ ని అందుకున్నాయి.

ఇప్పటివరకు మొత్తం ఏడు సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తే.. వాటిలో టాలీవుడ్ నుంచి మూడు, బాలీవుడ్ నుంచి మూడు, శాండిల్‌వుడ్ నుంచి ఒకటి ఉంది. తమిళ్ పరిశ్రమ నుంచి మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు తమిళ్ పరిశ్రమ నెంబర్ వన్ అనిపించుకుంది. తమిళ్ ఇండస్ట్రీలో తెరకెక్కిన సినిమాలు ఇతర పరిశ్రమల్లో కూడా రికార్డులు సృష్టించేవి. కానీ ఇప్పుడు ఒక గట్టి హిట్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నారు. రజినీకాంత్, విజయ్, కమల్ హాసన్ లాంటివారు తమ ఇమేజ్ తో 600 కోట్ల మార్క్ వరకు అయితే సినిమాని తీసుకు వస్తున్నారు. కానీ వెయ్యి కోట్ల క్లబ్ లోకి మాత్రం చేరలేకపోతున్నారు. మరి రానున్న రోజుల్లో అయినా తమిళ పరిశ్రమ వెయ్యి కోట్ల మార్క్ ని అందుకుంటుందేమో చూడాలి.