Dil Raju : ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో సినిమాలు!

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు షూటింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Dil Raju

Dil Raju

సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు షూటింగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి సమస్యలపై చర్చిస్తున్నారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము తీసుకున్న కొత్త నిర్ణయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 1 నుంచి షూటింగ్‌ను నిలిపివేసి మరిన్ని కమిటీలను ఏర్పాటు చేశాం. నిర్మాతలుగా మేం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. టికెట్‌ రేట్లు కూడా తగ్గించాలని కోరుతున్నాం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలతో మాట్లాడాం. థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల టిక్కెట్‌ ధరలను తగ్గించాలని నిర్ణయించాం.

“షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో మూడు, నాలుగు రోజుల్లో తుది సమావేశాలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే అన్నీ వివరంగా చెబుతామని చెప్పారు. సి కళ్యాణ్, మైత్రి రవి, దామోదర ప్రసాద్, బాపినీడు, దర్శకుడు తేజ పాల్గొన్నారు.

  Last Updated: 18 Aug 2022, 11:04 PM IST