Site icon HashtagU Telugu

National Cinema Day 2023 : సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఛాన్స్

National Cinema Day 2023

National Cinema Day 2023

సినీ లవర్స్ కు గుడ్ న్యూస్..ప్రస్తుతం మల్టీప్లెక్స్‌ (Multiplexes)లో సినిమా చూడాలంటే రూ. 150 లేదా రూ. 200 పెట్టాల్సిందే. అది ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూడాలంటే వెయ్యి రూపాయిలు పెట్టాల్సిందే. అయితే ఇప్పుడు కేవలం రూ.99 లకే మల్టీప్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్ లభించింది. కాకపోతే ఏది ఎప్పటికి కాదు జస్ట్ రేపు (అక్టోబర్ 13) ఒక్క రోజే మాత్రమే. ఎందుకంటే రేపు జాతీయ సినిమా దినోత్సవం (National cinema day) . ఈ సందర్బంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) రేపు ఒక్క రోజు ఇండియా లో ఏ మల్టీప్లెక్స్‌లో నైన రూ. 99 లకే సినిమా చూసి ఛాన్స్ అందిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున అత్యధికంగా ఒకేరోజు 6.5 మిలియన్ల వీక్షకులతో రికార్డు నెలకొల్పగా ఈ ఏడాది ఆరికార్డును అధిగమించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాది 4000కు పైగా స్క్రీన్లు ఈ వేడుకను జరుపుకోనున్నాయి. దేశ‌వ్యాప్తంగా ఉన్న PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లలో కేవ‌లం రూ.99కే సినిమా చూసే అవ‌కాశాల‌న్ని ప్రేక్ష‌కుల‌కు క‌ల్పిస్తుంది. చాలా మంది ప్రేక్ష‌కుల‌కు మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూడాల‌ని ఆశ‌గా ఉంటుంది. కానీ టిక్కెట్ రేట్ల కార‌ణంగా వెన‌క‌డుగు వేస్తుంటారు. ఇక ఇప్పుడు వాళ్ళంద‌రూ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌ల టిక్కెట్ రేట్ల కంటే త‌క్కువ‌ ధ‌ర‌తోనే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూడోచ్చు.

కాకపోతే మన రెండు తెలుగు(Telangana, Andhra pradesh) రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఇక్కడ మల్టీప్లెక్స్‌లలో ఒక్క టికెట్ ధర రూ. 112 ఉంది. కేరళలో రూ.129 విక్రయిస్తున్నారు. దేశంలోని చాలాచోట్ల రూ.99కే టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ఫార్మాట్, నాన్ రెక్లయినర్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గోల్డ్ సీట్లకు మాత్రం పాత ధరలే ఉన్నాయి. ఇక ప్రతి శుక్రవారం థియేటర్లో సందడి చేయడానికి సినిమాలు రెడీగా ఉంటాయి. అలాగే రేపు పదికి పైగా చిన్న, మధ్యతరహా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన సినిమాను బుక్ చేసుకొని సినిమాను ఎంజాయ్ చెయ్యండి.

Read Also : TDP vs YCP : ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల స‌వాల్‌ను స్వీక‌రించిన టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య.. స్కిల్ స్కాంలో ..?