Site icon HashtagU Telugu

Producers vs Reviewers : సినిమా రివ్యూస్ పై ఇండస్ట్రీ కాల్.. ఎవరిది కరెక్ట్..!

Movie Reviews Producers Vs Reviewers

Movie Reviews Producers Vs Reviewers

Producers vs Reviewers కోట్ల కొద్దీ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే సినిమా ఇంకా చాలా చోట్ల మొదటి ఆట పడకముందే సినిమా రిజల్ట్ ని నిర్ణయిస్తూ రివ్యూస్ ఇస్తుండటం తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో అయితే అర్ధరాత్రుళ్లు కూడా ట్వీట్ రివ్యూస్ వేస్తూ హడావిడి చేస్తుంటారు. ఒక్కోసారి సినిమా రివ్యూస్ ఎఫెక్ట్ వల్ల సినిమాలు ఆడలేదని చిత్రయూనిట్ డైరెక్ట్ గా రివ్యూయర్స్ మీద ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి.

సినిమా బాగుంటే రివ్యూస్, రేటింగ్స్ ఏమి చేయలేవని తెలుసు. అయితే లేటెస్ట్ గా కోటబొమ్మాళి సినిమా ఈవెంట్ లో సినిమా రివ్యూస్ మీద ఆసక్తికరమైన చర్చ జరిగింది. కోటబొమ్మాళి పి.ఎస్ ఈవెంట్ లో వెరైటీగా సినిమా రిపోర్టర్స్ ని స్టేజ్ మీదకు పిలిచి వారితో సినిమా నిర్మాతలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.

సినిమా గురించి రిపోర్టర్స్ అందరితో నిర్మతలంతా కూడా రివ్యూస్ రేటింగ్ గురించి ప్రస్తావించారు. పదేళ్లలో ఒక్క 4, 5 రేటింగ్ సినిమా రాలేదా.. రివ్యూస్ అంతా కూడా ఎందుకు 2.5 నుంచి 3.5 వరకే ఉంటాయని అన్నారు. దీనికి మీడియా ప్రతినిధులు కూడా కమర్షియల్ యాసెప్ట్ లో సినిమా చూసిన రివ్యూయర్ తన మనసుకు ఏమనిపిస్తే అదే రాస్తాడు.. రేటింగ్స్ కూడా 4, 5 ఇవ్వలేమని అన్నారు.

అంతేకాదు రివ్యూయర్స్ అంతా కావాలని ఒకే తరహా రేటింగ్ ఇస్తారనేది కూడా వాస్తవం కాదని అన్నారు. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు ఈ రివ్యూయర్స్ తో చర్చించి సినిమా తీస్తా అప్పుడైనా 4 రేటింగ్ ఇస్తారేమో అని అడిగారు. ఒకప్పుడు సినిమా రివ్యూ రిలీజైన వారం తర్వాత వచ్చేదని. ఇప్పుడు సినిమా షో పడుతుంటేనే రివ్యూస్ వస్తున్నాయని అన్నారు.

ఎక్కడో అమెరికాలో షో పడితే అక్కడ నుంచి వచ్చిన హింట్స్ తో ఇక్కడ రివ్యూస్ ఇస్తుంటారు. ఇక్కడ వాళ్లు సినిమా చూడకుండానే రివ్యూస్ రాస్తున్నారని అన్నారు మరో మీడియా ప్రతినిధి లక్ష్మి నారాయణ.

నిర్మాతలు వర్సెస్ మీడియా ఈ రివ్యూస్ మీద ఇది ఎప్పటికీ కొనసాగే చర్చే. కేవలం రివ్యూస్ వల్లే సినిమా ఫలితం మారుతుంది అని చెప్పడం కష్టం. మంచి సినిమాను మీడియానే ముందుండి ప్రోత్సహిస్తుంది. అయితే 4 రేటింగ్ ఎందుకు ఇవ్వట్లేదు అన్న దానికి ఆన్సర్ చెప్పడం కష్టం కానీ ఆ రేంజ్ రేటింగ్ ఇచ్చే సినిమా తీయాలని అనుకోవడం మంచిదని చెప్పొచ్చు.

Also Read : Aadikeshava Trailer : ఆదికేశవ ట్రైలర్ టాక్ ..

We’re now on WhatsApp : Click to Join