Site icon HashtagU Telugu

Goddess Kaali: దుమారం రేపుతున్న ‘కాళీకదేవి’ పోస్టర్!

Kali

Kali

చిత్రనిర్మాత లీనా మణిమేకలై దర్శకత్వం వహించిన ఒక డాక్యుమెంటరీకి సంబంధించిన కాళీక దేవి పోస్టర్ వివాదస్పదమవుతోంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా పోస్టర్ ఉందంటూ పలువురి నుంచి  అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టొరంటోకు చెందిన చిత్రనిర్మాత తన ట్విట్టర్ లో ఈ ఫొటోను షేర్ చేశారు. దేవత దుస్తులు ధరించి ధూమపానం చేస్తున్న స్త్రీగా చిత్రీకరించారు. ఈ విషయమై ఫిల్మ్ మేకర్ లీనా “రిథమ్స్ ఆఫ్ కెనడా’లో భాగంగా @AgaKhanMuseumలో చిత్రం ప్రారంభోత్సవాన్ని పంచుకోవడం చాలా థ్రిల్డ్‌గా ఉంది” అని ట్వీట్ చేసింది. కొందరు ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో #ArrestLeenaManimekal’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

“లీనా మణిమేకలై హిందూ దేవుళ్లను సిగరెట్ తాగేవారిగా చిత్రీకరించిన మేకర్. ఆమె మా కాళిని అవమానిస్తోంది” అని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “లీనా మణిమేకలైని అరెస్టు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మా దేవత కాళీ మా దేవుడిని అగౌరవపరచడాన్ని మేము సహించము’’ మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన లాయర్ సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లీనా స్పందిస్తూ.. ‘పోగొట్టుకోవడానికి నా దగ్గరంటూ ఏమీ లేదు. ప్రాణం ఉన్నంత వరకు.. దేనికీ భయపడకుండా మాట్లాడతాను. ఒకవేళ నా ప్రాణమే వెల కడితే.. ఇచ్చేస్తాను’ అంటూ మరో ప్రకటన చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

Exit mobile version