Site icon HashtagU Telugu

Tollywood: ‘బన్నీ-రాజమౌళి’ కాంబో మూవీ ఫిక్స్?

123

123

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చింది దర్శకధీరుడు రాజమౌళి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన తీసిన ‘బాహుబలి’ సిరీస్ ఏ రకంగా వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు. టాలీవుడ్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాల రుచిని చూపించన ఘనత మాత్రం రాజమౌళిదే. ప్రస్తుతం ఈ దర్శక ధీరుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుద‌ల నేప‌థ్యంలో తీరిక లేకుండా ప్ర‌మోష‌న్స్ తో బిజీగా మారిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారాయన. వ‌చ్చే శుక్ర‌వార‌మే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో విడుదల కానుంది ‘ఆర్ఆర్ఆర్’.

ఇదిలా ఉంటే… తాజాగా ఓ సెన్సేష‌న‌ల్ న్యూస్ ఒక‌టి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే… రాజ‌మౌళి తన తదుపరి చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయ‌బోతున్నారట‌. పుష్పరాజ్ తో జ‌క్క‌న్న సినిమా చేయ‌బోతున్నాడ‌న్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌ గా మారింది. అల్లు అర్జున్, రాజమౌళి ఇప్ప‌టికే ప‌లుసార్లు స‌మావేశ‌మై సినిమా గురించి చర్చించార‌ట‌. రాజమౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ ప్రాజెక్టు కోసం ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఇది చారిత్రక నేపధ్యంతో కూడిన కథతో తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా త‌ర్వాత సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుతో చేయ‌బోతున్న మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతున్నారు రాజమౌళి.

మహేష్ తో సినిమా పూర్తవగానే బన్నీతో సినిమాను ట్రాక్ ఎక్కించనున్న‌ట్టు ఇన్ సైడ్ టాక్. అయితే అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయనప్పటికీ… ‘జక్కన్న-పుష్పరాజ్’ కాంబోలో మూవీ రావడం మాత్రం పక్కా అనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇకపోతే ఇటీవ‌ల సుకుమార్ డైరెక్ష‌న్‌ లో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ‘పుష్ప’ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. పాన్ ఇండిమా స్థాయిలో రిలీజైన ‘పుష్ప’… బాలీవుడ్ లోనూ దుమ్ముదులిపే కలెక్షన్లను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ గా పుష్పరాజ్ మారిపోయాడు. ఇపుడు ‘పుష్ప- 2’ పై ఫోక‌స్ పెట్టారు అల్లు అర్జున్.