ఒక్కటవ్వనున్న మోస్ట్ బ్యూటిఫుల్ కపూల్.. డిసెంబర్ లో పెళ్లికి సిద్ధం!

హీరోహీరోయిన్లు స్క్రీన్ పై రొమాన్స్ చేయడం, ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లాంటివన్నీ చాలా కామన్. కానీ అదే హీరోహీరోయిన్లు రియల్ లైఫ్ లోనూ ప్రేమించుకొని పెళ్లిచేసుకుంటే చాలా స్పెషల్ అని చెప్పక తప్పదు.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 02:47 PM IST

హీరోహీరోయిన్లు స్క్రీన్ పై రొమాన్స్ చేయడం, ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లాంటివన్నీ చాలా కామన్. కానీ అదే హీరోహీరోయిన్లు రియల్ లైఫ్ లోనూ ప్రేమించుకొని పెళ్లిచేసుకుంటే చాలా స్పెషల్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే ఎంతోమంది హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోగా.. తాజాగా మరో బ్యూటిఫుల్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ పెళ్లి చేసుకోబోతున్నారు.

రణబీర్ కపూర్, అలియా భట్ డిసెంబర్‌లో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ఈ టాలీవుడ్ ప్లే బాయ్ సినిమా చేయనున్నాడు. ఆ సినిమా పేరు యానిమల్. ఈ క్రేజీ కాంబినేషన్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇదే సమయంలో రణబీర్, అలియా పెళ్లి వార్తలు సైతం చర్చకు వచ్చాయి. డిసెంబర్ లో పెళ్లి ఉండటంతో.. రణబీర్ తన డేట్స్ అన్నీ వచ్చే ఏడాదికి మార్చినట్టు తెలుస్తోంది. ఇక అలియా కూడా వచ్చే ఏడాది జనవరి వరకు ఏ ప్రాజెక్ట్స్ డేట్స్ కూడా ఇవ్వలేదని సమాచారం. ప్రస్తుతం ఆమె డార్లింగ్స్ మూవీకి సంబంధించిన షెడ్యూల్స్ కంప్లీట్ చేసింది.

రణబీర్ తన యానిమల్ షూట్‌ను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే షంషేరాను కూడా ప్రమోట్ చేయనున్నాడు. డిసెంబర్‌లో రణబీర్, అలియా వివాహం చేసుకోబోతున్నారని బజ్ ఉంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. వీరిద్దరూ రాజస్థాన్ లేదా ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. వారి అభిమానులు ఈ జంట పెళ్లి కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా సినీ పరిశ్రమలో వీరి పెళ్లిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇంకొన్ని రోజులు గడిస్తేకానీ మరింత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.