Site icon HashtagU Telugu

Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ పక్కా..!

Salaar Teaser

Salaar

Salaar Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabahs) అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సలార్’ మూవీ టీజర్ (Salaar Teaser) విడుదలైంది. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మార్క్‌ కనిపిస్తూ.. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను మ్యాచ్ చేసేలా సలార్ టీజర్ ఉందని నెట్టింట టాక్ మొదలైంది. కాగా ఈ పవర్ ప్యాక్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్ర‌భాస్‌లోని హీరోయిజాన్ని టీజ‌ర్‌లో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఆవిష్క‌రించారు. చాలా మంది గ‌న్స్‌తో చుట్టూ ముట్టగా టినూ ఆనంద్ క‌థ‌ను చెప్ప‌డంతో టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా ప్రారంభ‌మైంది. ప్ర‌భాస్ ఎంట్రీ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉండ‌బోతుందో టీజ‌ర్‌లో చూపించారు ప్ర‌శాంత్ నీల్‌. చివ‌ర‌లో విల‌న్ పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ క‌నిపించాడు.

ఇది పార్ట్ 1 టీజ‌ర్ అని చెప్పి స‌లార్ రెండు పార్ట్‌లుగా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు మేకర్స్ స్పష్టత ఇచ్చారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. సలార్ పార్ట్ 1 ceasefire అని టీజర్ చివరలో వేశారు.

Also Read: Nikhil Siddhartha : అభిమానులకు సారీ చెప్పిన హీరో నిఖిల్.. ఆ సినిమా విషయంలో..

సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌తో ప్ర‌భాస్ ప‌రాజ‌యాల్ని అందుకోవ‌డంతో ఈ మూవీపైనే ప్ర‌భాస్‌ ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకున్నారు. కేజీఎఫ్ -2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. కేజీఎఫ్ -2 రికార్డుల‌ను స‌లార్ తిర‌గ‌రాయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంచ‌నా వేస్తోన్నారు. ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లే టీజర్ ఉండడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. సలార్‌ టీజర్ అన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందంటున్నారు.