Site icon HashtagU Telugu

Adipurush: ఆదిపురుష్ థియేటర్లోకి ప్రవేశించిన కోతి.. వైరల్ వీడియో

Adipurush

New Web Story Copy (90)

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ రోజు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రామాయణం కథని మోడరన్ గా ప్రజెంట్ చేశాడు దర్శకుడు ఓం రావత్. చిత్రంలో సీత పాత్రలో కృతిసనన్ నటించగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురిడి పాత్రలో నటించారు.

ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఆదిపురుష్ మొదటి రోజు మిక్స్డ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. కథ అందరికీ తెలిసినదే అయినా గ్రాఫిక్స్ వండర్స్ తో సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఇక సినిమాకి వచ్చిన ప్రేక్షకులు జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రభాస్ కనిపించిన ప్రతి సన్నివేశంలో జైశ్రీరామ్ నినాదంతో భక్తిని చాటుకుంటున్నారు. విశేషం ఏంటంటే రిలీజైన అన్ని థియేటర్లలో ఒక సీటును ఖాళీగా ఉంచారు. హనుమాన్ జీ పేరుతో సినిమా హాళ్లలో ఒక సీటు ప్రత్యేకంగా రిజర్వ్ చేయనున్నట్టు మేకర్స్ విడుదలకు ముందే ప్రకటించారు.

ఇదిలా ఉండగా అది పురుష్ విడుదలైన వివిధ థియేటర్ల నుండి ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన కొన్ని వీడియోలు ఆదిపురుష్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. సినిమా చూస్తున్న సమయంలో థియేటర్లోకి కోతి ప్రవేశించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో హనుమాన్ స్వయంగా రాముడిని చూసేందుకు వచ్చినట్టు భావిస్తున్నారు. హాలులోకి ప్రవేశించిన కోతి ప్రభాస్ పాత్ర రాగానే స్క్రీన్ వైపు ఆసక్తిగా చూసింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఆదిపురుష్ నిర్మాతలు హనుమాన్ జీ సినిమా చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.