Alia Bhatt Baby Bump Pics:బేబీ బంప్ తో అలియా భట్…నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు..!!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్-రణ్ బీర్ కపూర్ లు వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం అంగరంగవైభవంగా జరిగింది

  • Written By:
  • Publish Date - July 10, 2022 / 06:30 AM IST

బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్-రణ్ బీర్ కపూర్ లు వివాహబంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం అంగరంగవైభవంగా జరిగింది. ఇక పెళ్లైన రెండు నెలలకే అలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులకు శుభవార్త అందించింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వకుండా కమిట్ మెంట్ ఇచ్చిన సినిమాలు చేస్తోంది అలియా. ఇక హాలీవుడ్ మూవీ హార్ట్ ఆఫ్ స్టోన్ లో అలియా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్యే అలియాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఇంతకుముందు పోర్చుగల్ లోని ఎడారిలో షూటింగ్ చేసినప్పుడు కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ లీకైన ఫొటోలలో అలియా బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. తాజాగా పోర్చుగల్ కు సంబంధించిన షూటింగ్ ఫొటోలను అలియా షేర్ చేసింది. ఇందులో కూడా అలియా ప్రెగ్నెన్సీ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఈ ఫొటోల్లోని తన బేబీ బంప్ కవర్ చేసేందుకు అలియా బ్లాక్ జాకెట్ ధరించిందని కామెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్ర యూనిట్ కు అలియా థ్యాంక్స్ చేప్పింది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ గాల్ గాడోట్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.