నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Mokshagna ) తేజ హీరోగా ప్రశాంత్ వర్మ (Prashnth Varma) డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న పూజా కార్యక్రమాలతో (Mokshagna Movie Opening) మొదలు పెడతారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని వెల్లడించాయి. ఇప్పటికే ఈ సినిమాలో మోక్షజ్ఞ లుక్ను మేకర్స్ రివీల్ చేయగా ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ, దర్శకుడిగా క్రియేటివ్ సినిమాలకి పేరుగాంచిన డైరెక్టర్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. జంబిరెడ్డి , కల్కి, హనుమాన్ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలియంది కాదు..ఇప్పుడు మోక్షజ్ఞ తో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.
ఇక ఈ సినిమా కూడా మైథలాజికల్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందనే వార్తలు బయటకు వస్తుండడంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా త్వరగా మొదలుపెట్టి త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా ప్రముఖ హీరో తనయుడు చేస్తున్నాడని టాక్. ప్రశాంత్ వర్మ ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రం తనయుడు ధృవ్ విక్రం ని తీసుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే అతనితో కథా చర్చలు జరిగాయని సినిమాకు అతను దాదాపు ఓకే చెప్పారని తెలుస్తుంది. తమిళంలో ధృవ్ (Dhruv) స్టార్ డం కోసం ప్రయత్నిస్తున్నాడు.
Read Also : TDP : అభిమాని ఆత్మహత్య.. మంత్రి లోకేష్ ఎమోషనల్ పోస్ట్