నందమూరి బాలకృష్ణ (Balakrishna) నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అసలైఏ గురువారం ఓపెనింగ్ అవ్వాల్సింది. కానీ ఎందుకో ఆ వేడుక జరగలేదు. మోక్షజ్ఞ (Mokshagna) తొలి సినిమా కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు. ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ఎంతో వర్క్ చేశాడు. కానీ చివరన నిమిషంలో పూజా కార్యక్రమం అయ్యింది.
ఐతే సినిమా ప్రస్తుతానికి వాయిదా వేశారా లేదా పూర్తిగా ఆగిపోయిందా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ సినిమా కాంబో దాదాపు ఆగిపోయిందనే అంటున్నారు. మోక్షజ్ఞ తో వెంకీ అట్లూరి కూడా సినిమాకు రెడీ అని టాక్ వచ్చింది.
మోక్షజ్ఞ తొలి సినిమా..
మరి నిజంగానే ప్రశాంత్ వర్మ (Prashanth Varma) సినిమా ఆగిపోయిందా లేదా అన్నది చూడాలి. మోక్షజ్ఞ తొలి సినిమాకే ఇలా జరగడం ఏంటని నందమూరి ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు. మరి అసలు అప్డేట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.
వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రానుంది. ఈ సినిమా గురించి అప్డేట్స్ త్వరలో రానున్నాయి. ప్రశాంత్ వర్మ ఇదివరకు రణ్ వీర్ సింగ్ తో కూడా ఒక సినిమా చర్చల దాకా వచ్చి సినిమా ఓపెనింగ్ కు ముందు ఆగిపోయింది. మరి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ ప్రశాంత్ వర్మ సినిమాలు ఆగిపోవడంపై ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
Also Read : Pushpa 2 Nizam Collections : నైజాం లో రికార్డ్స్ తిరగరాసిన పుష్ప 2