Site icon HashtagU Telugu

Mokshagna : మోక్షజ్ఞ మొదటి సినిమా.. ఏం జరుగుతుంది..?

Mokshagna Movie What Happend with Prashanth Varma

Mokshagna Movie What Happend with Prashanth Varma

Mokshagna : నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ఇంకా తేజశ్విని కలిసి నిర్మించాలని అనుకున్నారు. సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రాగా సినిమా ముహుర్తం పెట్టే టైం కు ఎందుకో డైరెక్టర్ వెనక్కి తగ్గాడు. ఆ సినిమా ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

లేటెస్ట్ గా బాలకృష్ణ కి పద్మభూషణ్ వచ్చిన కారణంగా నారా భువనేశ్వరి ఒక స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయగా అందులో కొంతమంది బాలకృష్ణతో పనిచేసిన దర్శకులు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో ప్రశాంత్ వర్మ కూడా పాల్గొన్నాడు. బాలయ్య గురించి మాట్లాడుతూ అన్ స్టాపబుల్ ప్రోమో టైం లో ఆయన కమిట్మెంట్ గురించి చెప్పాడు.

ఐతే మోక్షజ్ఞ సినిమా గురించి కాదు కానీ నెక్స్ట్ అప్డేట్ ఏంటన్నది కానీ ప్రశాంత్ వర్మ ప్రస్తావించలేదు. ఆ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయడం కుదరదని కథ మాత్రం అందిస్తానని అంటున్నాడట. అక్కడే వ్యవహారం దెబ్బ కొడుతుంది. అసలు మోక్షజ్ఞ తొలి సినిమా ఉంటందా లేదా ప్రశంత్ వర్మ ఈ సినిమా చేస్తాడా లేదా అన్న క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే జై హనుమాన్ అనౌన్స్ చేసిన ప్రశాంత్ ఆ సినిమా కూడా రిషబ్ శెట్టి డేట్స్ ఇస్తేనే సెట్స్ మీదకు వెళ్తుంది.