Site icon HashtagU Telugu

Shah Rukh Khan : మోహన్‌లాల్‌, షారుక్ మధ్య స్వీట్ చిట్ చాట్.. ప్లేస్ మీరు చెప్తారా..? లేక నన్ను చెప్పమంటారా..?

Mohanlal Shah Rukh Khan Sweet Chit Chat In Social Media Gone Viral

Mohanlal Shah Rukh Khan Sweet Chit Chat In Social Media Gone Viral

Shah Rukh Khan : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. ‘పఠాన్’ మూవీ నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నారు. దీంతో ఆడియన్స్ అండ్ తన తోటి సెలబ్రిటీస్ తో నెట్టింట స్వీట్ చిట్ చాట్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.. ఓ ఈవెంట్ లో పలువురు సూపర్ స్టార్ కి సంబంధించిన సాంగ్స్ కి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు. ఈక్రమంలోనే రజినీకాంత్ ‘జైలర్’లోని హుక్కుమ్ సాంగ్‌కి, అలాగే షారుఖ్ ‘జవాన్’లోని జిందా బందా పాటకి డాన్స్ వేసి ఆడియన్స్ నుంచి విజుల్స్ అందుకున్నారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోలు షారుఖ్ వరకు చేరడంతో.. ఆయన రియాక్ట్ అవుతూ, మోహన్ లాల్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు. “థాంక్యూ మోహన్ లాల్ సార్. ఈ సాంగ్ మీరు చేయడం నాకు ఎంతో స్పెషల్. మీరు చేసిన డాన్స్ లో నేను సగమే చేశాను. మీరు అసలైన ఓజి జిందా బందా, లవ్ యు సార్. నేను మిమ్మల్ని కలిసి డిన్నర్ చేయడానికి ఎదురు చూస్తున్నాను. అది ఎప్పుడో చెప్పండి” అంటూ ట్వీట్ చేసారు.

దీని మోహన్ లాల్ స్పందిస్తూ.. “డియర్ షారుఖ్ నువ్వు చేసినట్లు ఇంకెవరు చేయలేరు. నీ స్టైల్ లో నువ్వే ఎప్పటికీ ఓజి జిందా బందా. ఇక డిన్నర్ విషయానికి వస్తే.. కేవలం డిన్నర్ మాత్రమేనా..? బ్రేక్ ఫాస్ట్ చేసి జిందా బందా కూడా ఎందుకు చేయకూడదు..?” అంటూ షారుఖ్ కి బదులీహ్చారు. ఇక దీని షారుఖ్ రెస్పాండ్ అవుతూ.. “కచ్చితంగా సార్. మరి ఆ డిన్నర్ ప్లేస్ మీరు చెప్తారా..? లేక నన్ను చెప్పమంటారా..?” అంటూ క్యూస్షన్ చేసారు. దీనికి మోహన్ లాల్ బదులిస్తూ.. “నీకు ఆతిథ్యం ఇవ్వడాన్ని నేను ప్రేమిస్తాను. కాబట్టి ప్లేస్ నాదే” అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ట్వీట్స్ చూస్తుంటే.. త్వరలోనే షారుఖ్, మోహన్ లాల్ ఇంటిలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.