Mohanlal Neru Movie Talk : జీతూ జోసెఫ్.. మోహన్ లాల్.. నెరు మరో హిట్టు బొమ్మ..!

Mohanlal  Neru Movie Talk మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ అక్కడ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే అది కచ్చితంగా సూపర్ హిట్

Published By: HashtagU Telugu Desk
Mohan Lal Jeethu Joseph Neru Movie Talk

Mohan Lal Jeethu Joseph Neru Movie Talk

Mohanlal  Neru Movie Talk మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ అక్కడ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. దృశ్యం సినిమా సీరీస్ లతో ఈ కాంబోపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత కూడా వీరి కాంబోలో సినిమాలు వచ్చాయి.

We’re now on WhatsApp : Click to Join

లేటెస్ట్ గా మోహన్ లాల్ లీడ్ రోల్ లో జీతూ జోసెఫ్ (Jeethu Joseph) డైరెక్షన్ లో ఒక సినిమా వచ్చింది. అదే నెరు. మలయాళంలో థియేట్రికల్ వెర్షన్ సూపర్ హిట్ అవ్వగా ఈమధ్యనే ఓటీటీలో అన్ని భాషల్లో రిలీజ్ చేశారు.

డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న నెరు సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా వావ్ అనేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి అంటే అంధురాలైన ఒక అమ్మాయిని ఒక వ్యక్తి అత్యాచారం చేస్తాడు. అయితే ఆమెకు తను తాకిన మనిషి బొమ్మ గీసే టాలెంట్ ఉంటుంది. అలా తనపై అఘాయిత్యం చేసిన వాడి బొమ్మ గీస్తుంది. పోలీసులు వాడిని అరెస్ట్ చేస్తారు. అయితే ప్రముఖ వ్యాపారవేత కొడుకైన అతన్ని ఈ కేసు నుంచి తప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. మొదటి హియరింగ్ కే అతనికి బెయిల్ వస్తుంది.

ఆ టైం లో మోహన్ లాల్ లాయర్ గా ఆమె కేసు వాధిస్తాడు. ఫైనల్ గా ఆమెకు న్యాయం జరిగేలా చేస్తాడు. ఈ కోర్ట్ రూం డ్రామాతో జీతూ జోసెఫ్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సినిమా నడిపించాడు. నెతు కథ చాలా సింపుల్ గానే అనిపించినా కథనంలో ఆయన ప్రతిభ కనబరిచారు. మోహన్ లాల్ మరోసారి తన వర్సటైల్ నటనతో అదరగొట్టారు.

Also Read : Sapta Sagaralu Side B OTT Released : సైలెంట్ గా ఓటీటీలో సూపర్ హిట్ మూవీ.. సైడ్ బి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

సినిమా అంతా కూడా ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అన్న కోణంలో ప్రేక్షకుడి ఆలోచించేలా ఎంగేజ్ చేశారు. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. సినిమాలో నటించిన అనస్వర రాజన్, ప్రియమణి, శాంతి మాయదేవి, జగదీష్ అంతా బాగా చేశారు.

  Last Updated: 26 Jan 2024, 05:01 PM IST