టీటీడీలో(TTD) సినీ రంగానికి చెందిన పలువురు వివిధ పదవులలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీలో మరో సినీ ప్రముఖుడుకి ఓ పదవిని ఇచ్చారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలకు జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరి కమిటీ సభ్యునిగా శ్రీ మోహన్ ముళ్ళపూడి(Mohan Mullapudi) నియమితులయ్యారు.
మోహన్ ముళ్ళపూడి గతంలో పలు సినిమాలు నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కు(FNCC) హానరబుల్ సెక్రెటరీ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జూబ్లీహిల్స్, కరీంనగర్ మరియు హిమాయత్‌నగర్ లోని టీటీడీ దేవాలయాల అభివృద్ధికి, కరీంనగర్‌లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనులకు సహకరిస్తానని తెలిపారు.
Also Read : TTD Good News : నవ దంపతులకు టీటీడీ గుడ్ న్యూస్.. ఏమిటంటే ?