Site icon HashtagU Telugu

Mohan Babu : కన్నప్ప సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు.. 600 మందితో 90 రోజుల పాటు..

Mohan Babu Update on Manchu Vishnu Kannappa Movie

Mohan Babu Update on Manchu Vishnu Kannappa Movie

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా బాలీవుడ్(Bollywood) డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వంలో ‘కన్నప్ప'(Kannappa) సినిమా భారీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల బడ్జెట్ తో న్యూజిలాండ్ అడవుల్లో గత కొన్ని నెలలుగా చిత్రీకరణ చేస్తున్నారు కన్నప్ప సినిమాని. ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రీతీ ముకుందన్, మధుబాల, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం.. ఇలా చాలా మంది స్టార్స్ అన్ని భాషల నుంచి నటిస్తున్నారు.

మంచు విష్ణు, కన్నప్ప మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు న్యూజిలాండ్ నుంచి షూటింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా కన్నప్ప సినిమా గురించి అప్డేట్ ఇస్తూ మోహన్ బాబు(Mohan Babu) ఓ ట్వీట్ చేశారు.

మోహన్ బాబు తన ట్వీట్ లో.. న్యూజిలాండ్ లో 600 మంది హాలీవుడ్, మరియు భారతదేశంలోని అతిరధ మహారధులైన నటీనటులతో, థాయిలాండ్ మరియు న్యూజిలాండ్ సాంకేతిక నిపుణులతో, విష్ణు మంచు కథానాయకుడిగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. 90 రోజుల మొదటి షెడ్యూల్ న్యూజిలాండ్ లోని అద్భుతమైన లొకేషన్స్ లో ఆ పరమేశ్వరుడు, షిర్డీ సాయినాథుని ఆశీస్సులతో అనుకున్నది అనుకున్నట్టుగా దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వస్తున్నాం అని పోస్ట్ చేశారు.

దీంతో కన్నప్ప ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిందని, ఆల్మోస్ట్ షూట్ పూర్తయిందని, ఇంకొంచెం షూట్ బ్యాలెన్స్ ఉండగా త్వరలోనే అది కూడా మరో షెడ్యూల్ లో పూర్తిచేసి వచ్చే సంవత్సరమే కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారని సమాచారం.