Prabhas : ప్రభాస్‌తో ‘కన్నప్ప’ చేయాలని సీన్స్ రాసుకున్న కృష్ణంరాజు.. మోహన్ బాబు కామెంట్స్..

ప్రభాస్‌తో 'కన్నప్ప' చేయాలని కృష్ణంరాజు కొని సీన్స్ కూడా రాసుకున్నారట. అయితే మోహన్ బాబు ఫోన్ చేసి అడగడంతో..

  • Written By:
  • Publish Date - June 14, 2024 / 04:11 PM IST

Prabhas : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం.. శ్రీకాళహస్తి శివక్షేత్రం చరిత్రలోని శివుడి మహాభక్తుడైన కన్నప్ప కథతో తెరకెక్కుతుంది. ఇదే కథతో 48ఏళ్ళ క్రిందట కృష్ణంరాజు ప్రధాన పాత్రలో ‘భక్త కన్నప్ప’ వచ్చింది. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అలాగే కృష్ణంరాజు కెరీర్ లో కూడా ఓ మర్చిపోలేని మైలురాయిగా నిలిచిపోయింది.

కృష్ణంరాజు తన సినిమాల్లో ఏదైనా సినిమాని ప్రభాస్ రీమేక్ చేయాలి అనుకుంటే.. అది ‘కన్నప్ప’ అనే చెప్పుకొస్తారు. ఆ ఆశతో కన్నప్పని ప్రభాస్ తో రీమేక్ చేయాలని కూడా ప్రయత్నించారు. అంతేకాదు తానే సొంతంగా కొన్ని సీన్స్ ని కూడా రాసిపెట్టుకున్నారు. కానీ ప్రభాస్ తో ‘కన్నప్ప’ చేయాలనే కల.. కలగానే మిగిలిపోయింది. కాగా ఈ ప్రాజెక్ట్ ని కేవలం కృష్ణంరాజు మాత్రమే కాదు.. టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు కూడా రీమేక్ చేయాలని ప్రయత్నాలు చేసారు. అలా చేసిన వారిలో మంచు ఫ్యామిలీ కూడా ఉంది.

ఫైనల్ గా మంచు విష్ణుతో ఈ రీమేక్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కింది. అయితే ఈ సినిమా చేసే ముందు మోహన్ బాబు.. కృష్ణంరాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నారట. కృష్ణంరాజుకి ఫోన్ చేసి.. “కన్నప్ప కథని మంచు విష్ణుతో చేయాలని అనుకుంటున్నాను. అందుకు నీ అనుమతి కావాలి” అని అడిగారట. అందుకు కృష్ణంరాజు అంగీకరించడమే కాకుండా, తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ మరియు తాను రాసుకున్న కొన్ని సన్నివేశాలను కూడా మంచు విష్ణుకి అందజేశారట. ఈ విషయాన్ని కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్ లో మోహన్ బాబు తెలియజేసారు.