Chiranjeevi : చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల కలెక్షన్ కింగ్ రియాక్షన్ ..

చిత్రసీమలో మెగాస్టార్ (Megastar) గా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి (Chiranjeevi)కి.. తాజాగా పద్మ విభూషణ్ (Padma Vibhushan) పుర్కస్కారం వరించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు , తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్వీట్స్ చేసి విషెష్ అందజేస్తుంటే..మరికొంతమంది సినీ ప్రముఖులు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]

Published By: HashtagU Telugu Desk
Chiru Mohan

Chiru Mohan

చిత్రసీమలో మెగాస్టార్ (Megastar) గా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి (Chiranjeevi)కి.. తాజాగా పద్మ విభూషణ్ (Padma Vibhushan) పుర్కస్కారం వరించింది. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మెగా అభిమానులతో పాటు చిత్రసీమ ప్రముఖులు , తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్వీట్స్ చేసి విషెష్ అందజేస్తుంటే..మరికొంతమంది సినీ ప్రముఖులు నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో కలెక్షన్ కింగ్ , చిరంజీవికి ప్రాణ స్నేహితుడు మోహన్ బాబు(Mohan Babu)..చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి.. అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నానని .. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను.. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటె మెగాస్టార్‌ కోసం చిత్ర పరిశ్రమ నుంచి ఒక వేడుకను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబందిచిన అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. ఒక సామాన్య మధ్య తరగతి నుంచి తెలుగు సినీ రంగంలో తన కంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు చిరంజీవి. స్వయంకృషి, స్వీయప్రతిభే చిరు కెరీర్ కు పునాదిరాళ్లుగా ఉపయోగపడ్డాయి. అడుగడుగునా సవాళ్లను అధిగమించి చరిత్ర సృష్టించిన విజేత.బాక్సాఫీసు రికార్డులు సృష్టించిన మగధీరుడు. ఆశేష అభిమానులకు మెగాస్టార్ చిరంజీవిగా అభిమానుల గుండెల్లో కొలువైనాడు. స్టార్ ఇమేజ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన కథానాయకుడు చిరంజీవి. నటుడిగా 150పైగా చిత్రాలు చేసారు. అంతేకాదు సినీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే..రాజకీయబాట పట్టాడు.ఎమ్మెల్యే అయ్యాడు. ఆపై రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రాజకీయాలను పూర్తిగా ఒదలిపెట్టి మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయ్యారు.

Read Also : Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు

  Last Updated: 27 Jan 2024, 03:38 PM IST