Site icon HashtagU Telugu

Nani Pardije : నాని ‘ది ప్యారడైజ్’ నుండి మోహన్ బాబు లుక్ రిలీజ్

Mohan Babu Look The Paradis

Mohan Babu Look The Paradis

వరుస బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న నేచురల్ స్టార్ నాని (Nani) మరోసారి విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రం ‘ది ప్యారడైజ్’(ThePardije ) ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. యువతకు ఎంతో ప్రీతికరమైన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం కూడా మరో హైలైట్‌గా నిలుస్తోంది.

తాజాగా మేకర్స్ విడుదల చేసిన అప్డేట్ సినిమా క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కీలకమైన పాత్రలో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. షర్ట్ లేకుండా బలమైన శరీరాకృతితో కనిపించిన మోహన్ బాబు మాస్ లుక్ ప్రస్తుతం సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. నాని – మోహన్ బాబు కాంబినేషన్ ఈ చిత్రంలో ఎలా కుదురుతుందో అన్న ఆసక్తి కూడా పెరుగుతోంది.

1980లలో హైదరాబాద్‌లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ వంటి అనేక భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్ జరగనుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. నాని విభిన్నమైన కాన్సెప్ట్, మోహన్ బాబు శక్తివంతమైన పాత్ర, అనిరుధ్ సంగీతం ఇలా అన్ని ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాయి.

Exit mobile version