Site icon HashtagU Telugu

Mohan Babu : ప్రభాస్‌ని బావ అన్న మోహన్ బాబు.. ఆడేసుకుంటున్న నెటిజన్లు..

Mohan Babu Calling Prabhas as Brother in Law after watching Kalki Tweet goes Viral

Mohan Babu Prabhas

Mohan Babu : సినీ పరిశ్రమలో అందరూ క్లోజ్ గానే ఉంటారు. ఇప్పుడున్న స్టార్ హీరోలంతా కూడా సరదాగా బావ, అన్న అని కూడా పిలుచుకుంటారని మనకి తెలిసిందే. మంచు ఫ్యామిలీ ఏం చేసినా వైరల్ అవ్వాల్సిందే. తాజాగా మోహన్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో పాటు ట్రోలింగ్ కూడా అవుతుంది.

ప్రభాస్ కల్కి సినిమా ఇటీవలే థియేటర్స్ లో రిలీజయి సూపర్ హిట్ అయింది. భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అభిమానులు, ప్రేక్షకులే కాక సినీ పరిశ్రమలోని అనేకమంది సెలబ్రిటీలు కూడా కల్కి సినిమా చూసి అదిరిపోయింది అంటూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ఈ క్రమంలో మోహన్ బాబు సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు.

మోహన్ బాబు తన ట్వీట్ లో.. ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం… మహాద్భుతం…! మా బావ ప్రభాస్‌కి, అమితాబ్‌ బచ్చన్‌ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు. తెలుగు సినీ పరిశ్రమ, భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నాను అని పోస్ట్ చేసాడు. అయితే ఈ ట్వీట్ లో ప్రభాస్ ని బావ అనడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నీ ఏజ్ ఎంత, ప్రభాస్ ఏజ్ ఎంత.. నువ్వు ఆయన్ని బావ అని పిలవడమేంటని పలువురు అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు.

అయితే మంచు ఫ్యామిలీకి, ప్రభాస్ ఫ్యామిలీకి మంచి సంబంధాలే ఉన్నాయి. మంచు విష్ణు కోసం ప్రభాస్ కన్నప్ప సినిమాలో రెమ్యునరేషన్ లేకుండా కూడా నటిస్తున్నాడు. ఈ సాన్నిహిత్యంతోనే మోహన్ బాబు ప్రభాస్ ని అలా పిలిచాడని అనుకుంటున్నారు. గతంలో మోహన్ బాబు, ప్రభాస్ కలిసి బుజ్జిగాడు సినిమాలో కూడా నటించారు.