Site icon HashtagU Telugu

Kannappa : కన్నప్ప సినిమాలో ఇద్దరు పెదరాయుడులు.. ఇంకెంతమంది స్టార్ కాస్ట్ ని తెస్తారో..

Mohan Babu and Sarath Kumar will Play key Roles in Manchu Vishnu Kannappa Movie

Mohan Babu and Sarath Kumar will Play key Roles in Manchu Vishnu Kannappa Movie

మంచు విష్ణు(Manchu Vishhnu) డ్రీం ప్రాజెక్టు కన్నప్ప(Kannappa) సినిమా ప్రస్తతం న్యూజిలాండ్(New Zealand) అడవుల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు ప్రకటించారు. ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, నయనతార.. లాంటి స్టార్స్ కన్నప్ప సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నుంచి కూడా ఓ నటుడిని తీసుకోబోతున్నట్టు సమాచారం.

తాజాగా ఈ సినిమాలోకి తమిళ్ స్టార్ నటుడ్ని తీసుకున్నారు. సీనియర్ నటుడు శరత్ కుమార్(Sarath Kumar) కన్నప్ప సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

శరత్ కుమార్, మోహన్ బాబు(Mohan Babu) ఇద్దరూ కన్నప్ప సినిమాలో నటిస్తున్నారని తాజాగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే వీరిద్దరూ పెదరాయుడు సినిమా చేశారు. మొదట శరత్ కుమార్ తమిళ్ లో నట్టమై పేరుతో సినిమా తీయగా ఆ తర్వాత తెలుగులో దాన్ని ‘పెదరాయుడు’గా రీమేక్ చేశారు. దీంతో ఇద్దరు పెదరాయుడులు కన్నప్ప సినిమాలో కలిసి నటించబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే అన్ని పరిశ్రమల నుంచి ఒక్కో స్టార్ ని తీసుకున్నారు, ఇంకెంతమంది స్టార్స్ ని కన్నప్ప సినిమా కోసం తెస్తారో చూడాలి.

Also Read : Allu Arjun: ఐకాన్ స్టార్ ముఖ్య అతిథిగా అజయ్ భూపతి ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్!